TDP | బాబును కలిసిన మనోజ్, మౌనిక అలవిమాలిన కోర్టు కేసులు.. పార్టీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మీద బహిరంగంగా దాడులు.. పొలిటికల్ గా విచక్షణ, వివేచన క్రమశిక్షణ లేకపోవడం వంటి అంశాలు ఇప్పుడు భూమా అఖిల ప్రియకు పెద్ద కష్టాలు తెచ్చాయి. రానున్న ఎన్నికల్లో ఆమెకు ఆళ్లగడ్డ టికెట్ ఇచ్చేలా చంద్రబాబు లేరు. వీలైనంత వరకూ ఆమెను తప్పించి ఆమె చెల్లెలు భూమా మౌనిక కు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఈ […]
TDP |
బాబును కలిసిన మనోజ్, మౌనిక
అలవిమాలిన కోర్టు కేసులు.. పార్టీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మీద బహిరంగంగా దాడులు.. పొలిటికల్ గా విచక్షణ, వివేచన క్రమశిక్షణ లేకపోవడం వంటి అంశాలు ఇప్పుడు భూమా అఖిల ప్రియకు పెద్ద కష్టాలు తెచ్చాయి. రానున్న ఎన్నికల్లో ఆమెకు ఆళ్లగడ్డ టికెట్ ఇచ్చేలా చంద్రబాబు లేరు.
వీలైనంత వరకూ ఆమెను తప్పించి ఆమె చెల్లెలు భూమా మౌనిక కు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ఇందాకే మౌనిక, ఆయన భర్త మంచు మనోజ్ వెళ్లి చంద్రబాబును కలిశారు.
మంచు మనోజ్ ఇటీవల మాజీ మంత్రి టీడీపీ మహిళా నాయకురాలు అయిన భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనికారెడ్డిని రెండవ వివాహం చేసుకున్నారు. టిడిపి హయాంలో మంత్రిగా చేసినఅఖిల ప్రియ కిడ్నాప్ కేసులు ..బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడం తోబాటు పలు కేసుల్లో అప్రదిష్టను మూటగట్టుకున్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున అఖిల ప్రియకు టికెట్ రాదని కొన్నాళ్లుగా ప్రచారం ఉంది. ఈమధ్య జరిగిన నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇంచార్జుల సమావేశానికి సైతం అఖిల ప్రియకు పిలుపు రాలేదు.
లోకేష్ పాదయాత్ర సమయంలో అందరూ బహిరంగంగా చూస్తున్న సమయంలోనే అఖిల అనుచరులు మరో సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మీద దాడి చేయడం ఆమె దూకుడును తెలియజేసింది. ఇలాంటి ఘటనలు అన్నీ కలిపి ఆమెను పార్టీ టికెట్ కు దూరం చేస్తున్నాయి అంటున్నారు.
ఇప్పుడు అఖిల ప్రియకు బదులు ఆమె చెల్లెలు మౌనికకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితే మంచు మనోజ్ కూడా ఆమెకు అండగా నిలుస్తారని అంటున్నారు.