Manchu Manoj | మంచు మనోజ్ బర్త్‌డే సందర్భంగా కీలక వ్యాఖ్యలు.. సేవా కార్యక్రమాల విస్తరణ, ఫ్యామిలీ వివాదంపై సెటైర్లు
Manchu Manoj | హీరో మంచు మనోజ్ తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంలోనే కాకుండా కెరీర్ పరంగానూ మళ్లీ బిజీ అవుతున్న మనోజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు.
Manchu Manoj | హీరో మంచు మనోజ్ తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంలోనే కాకుండా కెరీర్ పరంగానూ మళ్లీ బిజీ అవుతున్న మనోజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల రెండు సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు హీరోగా ‘డేవిడ్ రెడ్డి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆయన లైనప్‌లో ఉన్నట్లు సమాచారం.
ఇక సినీ కెరీర్‌తో పాటు సామాజిక సేవలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన మనోజ్ ఇటీవల AIKYA ధైర్య సేన సమితి పేరుతో ఓ ట్రస్ట్‌ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు. పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్, ప్రస్తుతం తన సొంత నిధులతోనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో ఒక ప్రణాళిక ప్రకారం మరింత విస్తృత స్థాయిలో సామాజిక సేవలు చేపడతామని పేర్కొన్నారు.
ఫ్యామిలీ వివాదంపై స్పందన..
ఈ సందర్భంగా ఆయన కుటుంబ వివాదంపై కూడా స్పందించారు. తండ్రి మోహన్ బాబు , అన్నమంచు విష్ణుతో ఉన్న విభేదాలపై ప్రశ్నించగా, నేరుగా సమాధానం చెప్పకుండా సెటైరికల్‌గా స్పందించారు. “ఎవరిని అడగాలో మీకు తెలుసు… వారినే అడగండి. కానీ వెళ్లేటప్పుడు మైక్‌లు తీసుకెళ్లొద్దు, హెల్మెట్లు పెట్టుకుని వెళ్లండి” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదే సమయంలో తనకు న్యాయం జరిగిందా అనే ప్రశ్నకు కూడా మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “నాకు యూనివర్స్ రూపంలో న్యాయం జరిగింది” అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తనపై జరిగిన విషయాలను నేరుగా ప్రస్తావించకుండా, పరోక్షంగా స్పందించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
నా భార్య రాజకీయాల్లోకి..
ఇక తన భార్య మౌనిక రెడ్డి గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో లేనప్పటికీ, మౌనికా రెడ్డి రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాలున్నాయని తెలిపారు. ఆమె రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు మంచు కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విద్యాసంస్థల నిర్వహణ, కొన్ని వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ మనోజ్ గతంలో ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదానికి అసలు కారణం ఆస్తి వ్యవహారాలేనని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు కుటుంబ సభ్యులు స్పష్టమైన ప్రకటన చేయలేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram