గ్యాస్ కొరత పరిష్కరానికి మానిటరింగ్ కమిటీలు : మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరా నిర్ధారిస్తామని చెప్పారు.

Uttam kumar reddy

విధాత, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కమిటీలు, కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయమని చెప్పాయని ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలో సివిల్ సప్లై కమిషనర్ ఇతర అధికారులతో స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కమిటీలో ఇందులో పోలీస్, సివిల్ సప్లై అధికారులు ఉన్నారని వెల్లడించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీలు, వైద్య అధికారులు, ఎల్పీజీ కంపెనీ వాళ్ళతో కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు.

హైదరాబాద్ సివిల్ సప్లై ఆఫీస్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగం జరిగిందని, హోటల్స్, రెస్టారెంట్ యజమానులు తమను అత్యవసర సేవలుగా గుర్తించి సిలిండర్లు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు అని వెల్లడించారు. దీనిపై పరిశీలన చేస్తున్నట్లుగా ఉత్తమ్ పేర్కొన్నారు. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత మాది అన్నారు.
కొంత కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది అని, గ్యాస్ అంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం అని స్పష్టం చేశారు. గ్యాస్ కొరత నివారణకు కేంద్రం రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ఇచ్చింది అని గుర్తు చేశారు. ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచామని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కమిటీ ఫామ్ చేసినట్లుగా కేంద్రం తెలిపిందని, 1740 కిలో లీటర్ల కిరోసిన్ తెలంగాణ కు సప్లై చేస్తామని కేంద్రం చెప్పిందని ఉత్తమ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలుగు రాష్ట్రాల రైల్వేప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్
రేవంత్ బినామీ కంపెనీ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలి : కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ

Latest News