LPG Gas | వంట గ్యాస్ కోసం క్యూలైన్‌లో.. గుండెపోటుతో కుప్ప‌కూలిన వృద్ధుడు

LPG Gas | దేశ వ్యాప్తంగా క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ కొర‌త ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వంట గ్యాస్ కొర‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న ప్ర‌జ‌లు.. ఆయా గ్యాస్ ఏజెన్సీల వ‌ద్ద గ్యాస్ కోసం ప‌డిగాపులు కాస్తున్నారు.

  • By: raj |    national |    Published on : Mar 14, 2026 7:15 AM IST
LPG Gas | వంట గ్యాస్ కోసం క్యూలైన్‌లో.. గుండెపోటుతో కుప్ప‌కూలిన వృద్ధుడు

LPG Gas | దేశ వ్యాప్తంగా క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ కొర‌త ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వంట గ్యాస్ కొర‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న ప్ర‌జ‌లు.. ఆయా గ్యాస్ ఏజెన్సీల వ‌ద్ద గ్యాస్ కోసం ప‌డిగాపులు కాస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ 66 ఏళ్ల వ్య‌క్తి ఎల్పీజీ సిలిండ‌ర్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్‌లో నిల్చోగా.. చివ‌ర‌కు గుండెపోటుతో కుప్ప‌కూలిపోయాడు. ఆ వృద్ధుడి మ‌ర‌ణంతో స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని బ‌ర్నాల జిల్లాలో వెలుగు చూసింది.

బ‌ర్నాల జిల్లాలోని సాహ్నా గ్రామానికి చెందిన భూష‌ణ్ కుమార్ మిట్ట‌ల్(66) ఎల్పీజీ సిలిండ‌ర్ కోసం నిన్న ఉద‌యం 5 గంట‌ల‌కు గ్యాస్ ఏజెన్సీ వ‌ద్ద‌కు చేరుకుని క్యూలైన్‌లో నిల్చున్నాడు. భూష‌ణ్‌కు టోకెన్ నంబ‌ర్ 25 రాగా.. చాలా స‌మ‌యం వేచి చూడాల్సి వ‌చ్చింది. ఇక క్యూలైన్‌లో ఉన్న ఆయ‌న ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయాడు. అప్ర‌మ‌త్తమైన స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, గుండెపోటుతో కుప్పకూలిపోయిన‌ట్లు నిర్ధారించారు.

ఈ సంద‌ర్భంగా భూష‌ణ్ అల్లుడు రాబిన్ మిట్ట‌ల్ మాట్లాడుతూ.. మా అంకుల్ ఉద‌యం 5 గంట‌ల నుంచి క్యూలైన్‌లో నిల్చున్నాడు. గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్‌లో నిల్చోవ‌డం కార‌ణంగానే గుండెపోటుకు గుర‌య్యాడు. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. గ్యాస్ కొర‌త‌పై ప్ర‌భుత్వాల నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతోనే ఈ ప‌రిస్థితి దాపురించింద‌ని మండిప‌డ్డాడు.