Biryani | నాన్ వెజ్ ప్రియుల‌కు షాక్.. భారీగా పెర‌గ‌నున్న బిర్యానీ ధ‌ర‌లు..!

Biryani | నాన్ వెజ్ ప్రియుల‌కు( Non Veg Lovers )ఇది షాకింగ్ న్యూస్. ఇక బిర్యానీ ధ‌ర‌లు( Biryani Prices ) భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్( Commercial Gas ) సిలిండ‌ర్ ధ‌ర‌లు భారీగా పెరగ‌డమే ఇందుకు కార‌ణం.

  • By: raj |    telangana |    Published on : May 03, 2026 6:50 AM IST
Biryani | నాన్ వెజ్ ప్రియుల‌కు షాక్.. భారీగా పెర‌గ‌నున్న బిర్యానీ ధ‌ర‌లు..!

Biryani | నాన్ వెజ్ ప్రియుల‌కు( Non Veg Lovers )ఇది షాకింగ్ న్యూస్. ఇక బిర్యానీ ధ‌ర‌లు( Biryani Prices ) భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్( Commercial Gas ) సిలిండ‌ర్ ధ‌ర‌లు భారీగా పెరగ‌డమే ఇందుకు కార‌ణం. హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని ప‌లు హోట‌ల్స్, రెస్టారెంట్లు త‌మ మెనూలో మార్పులు చేప‌ట్ట‌నున్నాయి. బిర్యానీతో పాటు ఇత‌ర వంట‌కాల ధ‌ర‌ల‌ను కూడా భారీగా పెంచాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

వినియోగ‌దారుల‌పై అద‌న‌పు భారం

రెండు రోజుల క్రితం క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ. 1000కి పెంచిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే గ్యాస్ కొర‌త‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న హోట‌ల్స్, రెస్టారెంట్ల యాజ‌మాన్యాల‌కు.. ఈ గ్యాస్ ధ‌ర‌ల పెంపు గుదిబండ‌గా మారింది. ఈ అద‌న‌పు భారాన్ని వినియోగ‌దారుల‌పై మోపేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మ‌చారం. గ్యాస్ కొర‌త కార‌ణంగా చాలా హోట‌ల్స్ న‌ష్టాల్లో న‌డుస్తున్నాయి. దీనికి గ్యాస్ ధ‌ర కూడా పెర‌గ‌డంతో.. ధ‌ర‌లు పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ర‌వాణా ఛార్జీల‌తో క‌లిపి రూ. 3400కు చేరిన గ్యాస్ ధ‌ర

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌కు చెందిన ఓ హోట‌ల్ య‌జ‌మాని మాట్లాడుతూ.. గ‌తంలో 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్‌కు రూ. 2400 చెల్లించేవాళ్లం. ఇప్పుడు ఆ ధ‌ర ర‌వాణా ఛార్జీల‌తో క‌లిపి రూ. 3400కు చేరింది. బ్లాక్ మార్కెట్‌లో మ‌రో 2 వేలు అద‌నంగా వ‌సూలు చేస్తున్నాయి. దీని వ‌ల్ల మాపై అద‌నంగా ఆర్థిక భారం ప‌డుతుందని వాపోయాడు.

క‌ట్టెల పొయ్యి మీద బిర్యానీ త‌యారీ

అయితే గ్యాస్ కొర‌త‌ను అధిగ‌మించేందుకు చాలా హోట‌ల్స్ ఇప్ప‌టికే బిర్యానీల‌ను క‌ట్టెల పొయ్యి మీద వండి వ‌డ్డిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఫంక్ష‌న్ హాల్స్‌ను కిరాయికి తీసుకుని అక్క‌డ క‌ట్టెల పొయ్యి మీద వంట‌కాలు త‌యారు చేసి హోట‌ల్స్‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు ఓ హోట‌ల్ య‌జ‌మాని తెలిపాడు. ఇది చాలా ఖ‌ర్చుల‌తో కూడుకున్న వ్య‌వ‌హార‌మ‌ని ఆయ‌న వాపోయాడు.

ప్లేట్ బిర్యానీకి రూ. 30 నుంచి రూ. 40 వ‌ర‌కు పెంచే అవ‌కాశం

ప్ర‌స్తుతం క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ధ‌ర పెర‌గ‌డంతో.. ఆ ఆర్థిక భారం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బిర్యానీతో పాటు ఇత‌ర వంట‌కాల ధ‌ర‌లు పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. త్వ‌ర‌లోనే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపు ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల నిత్యావ‌స‌ర వ‌స్తువుల పెరుగుద‌ల‌కు కూడా దారి తీస్తుంది.. కాబ‌ట్టి ఒక్కో ప్లేట్ బిర్యానీకి రూ. 30 నుంచి రూ. 40 వ‌ర‌కు పెంచే అవ‌కాశం ఉంద‌ని మ‌రో హోట‌ల్ య‌జ‌మాని తెలిపాడు. త్వ‌ర‌లోనే మెనూలో భారీ మార్పులు ఉంటాయ‌ని ఆయ‌న పేర్కొన్నాడు.