ధాన్యం కుప్ప వద్ద మరో రైతు హఠాన్మరణం

నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలను కాపాడుకోవడంలో అవస్థలు పడుతున్న రైతులు అకస్మిక అనారోగ్యాల పాలవుతూ ప్రాణాల విడుస్తున్నారు. తాజాగా మెద‌క్ జిల్లా కొల్చారం (మం) చిన్నఘనాపూర్ గ్రామంలో ధాన్యం కుప్పల వద్దే గుండెపోటుతో రైతు శంకరయ్య మృతి చెందిన ఘటన విషాదం రేపింది.

ధాన్యం కుప్ప వద్ద మరో రైతు హఠాన్మరణం

యాసంగి వరి ధాన్యం కొనుగోలులో కొనసాగుతున్న తీవ్ర జాప్యంతో ఇబ్బందులు పడుతున్న ధాన్యం కుప్పల వద్దనే పడిగాపులు పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. ఓ వైపు మండుటెండలు, ఇంకోవైపు అకాల వర్షాల, ధాన్యం కొనుగోలుకు పెడుతున్న కొర్రీల మధ్య నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలను కాపాడుకోవడంలో అవస్థలు పడుతున్న రైతులు అకస్మిక అనారోగ్యాల పాలవుతూ ప్రాణాల విడుస్తున్నారు. తాజాగా మెద‌క్ జిల్లా కొల్చారం (మం) చిన్నఘనాపూర్ గ్రామంలో
ధాన్యం కుప్పల వద్దే గుండెపోటుతో రైతు శంకరయ్య మృతి చెందిన ఘటన విషాదం రేపింది.

తెల్లవారుజామున ఇంటి నుంచి తన ధాన్యం కుప్ప వద్దకు రాగానే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. తోటి రైతులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే రైతు మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటన యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న కష్టాలకు నిదర్శనంగా నిలిచింది. యాసంగి ధాన్యం కొనుగోలు సమస్యల నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా 10మంది వరకు రైతులు ప్రాణాల విడిచారని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Petrol and Diesel | దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులపై పెరుగుతున్న భారం
సన్​రైజర్స్​ హైదరాబాద్​: బెంగళూరుపై ఘనవిజయం – అయినా తప్పని ఎలిమినేటర్​