రేవంత్ బినామీ కంపెనీ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలి : కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ
సీఎం రేవంత్ రెడ్డి బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌పై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ రాశారు.
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడంలో బావ బామ్మర్థులు హరీశ్ రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై స్పీకర్ తీర్పును ప్రశ్నిస్తూ హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అనంతరం మూసీ ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ విమర్శలు సంధించారు. ఇక బామ్మర్థి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణ జరిపించాలంటూ కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు లేఖలు పంపించారు.
రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని కేటీఆర్ తన లేఖలో ఫిర్యాదు చేశారు. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయి అని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీ కోసమే అధికారుల పైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారు అని ఆరోపించారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదు అన్నారు. తన బినామీ కంపెనీ కోసం సాక్ష్యాధారాలను ముఖ్యమంత్రి మాయం చేయించారు అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది.. పోలీస్ వ్యవస్థపైన ప్రజలకు నమ్మకం పోయింది అని, కేఎల్ఎస్ఆర్ కంపెనీ దివాళా తీసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ సంస్థపై ఉన్న విచారణను అడ్డుకుంటున్నాడు అని, కేఎల్ఎస్ఆర్ కంపెనీపైన ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలు, కేసుల పైన పక్షపాతం లేకుండా, ఒత్తిడి లేకుండా నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీ కోసం రేవంత్ రెడ్డి 2500కు పైగా భారీ కాంట్రాక్టులను కేటాయించారు అని గుర్తు చేశారు.
సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణ పనులను అడ్డగోలుగా రేవంత్ రెడ్డి దివాలా తీసిన ఈ కంపెనీకి అప్పచెబుతున్నారు అని కేటీఆర్ లేఖలో ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు అని, ఆ కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికే సుప్రీంకోర్టు కేఎల్ఎస్ఆర్ కంపెనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తగిన విచారణ చేసి నిజాలు నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని గుర్తు చేశారు.
అయినా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం ఆదేశాలను పట్టించుకోవడం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. కాబట్టి వెంటనే ఈ కంపెనీ చేస్తున్న నేరాలు, ఈ కంపెనీకి ముఖ్యమంత్రి చేస్తున్న అనుచిత లబ్ది నేపథ్యంలో సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) వంటి ఏజెన్సీలతో సంపూర్ణ దర్యాప్తు చేయించాలని కేటీఆర్ కేంద్ర మంత్రులను తన లేఖలో కోరారు.
ఇవి కూడా చదవండి :
Actress | 66 ఏళ్ల వయస్సులో ఆ నటి తల్లి కాబోతుంది అంటూ వార్తలు … వైరల్ రూమర్లపై నటి నీనా గుప్తా క్లారిటీ
మూసీ సుందరీకరణ డీపీఆర్ ఎక్కడా..? ప్రజల ముందు పెట్టు: హరీశ్ రావు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram