Actress | 66 ఏళ్ల వ‌య‌స్సులో ఆ న‌టి త‌ల్లి కాబోతుంది అంటూ వార్త‌లు … వైరల్ రూమర్లపై నటి నీనా గుప్తా క్లారిటీ

Actress | సినీ పరిశ్రమలో త‌న‌దైన‌ అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలిచే సీనియర్ నటి నీనా గుప్తా మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశారు. 60 ఏళ్లు దాటిన తరువాత కూడా యాక్టివ్‌గా సినిమాలు, ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటున్న ఆమెపై తాజాగా వచ్చిన ఒక రూమర్‌కు తానే స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Actress | 66 ఏళ్ల వ‌య‌స్సులో ఆ న‌టి త‌ల్లి కాబోతుంది అంటూ వార్త‌లు … వైరల్ రూమర్లపై నటి నీనా గుప్తా క్లారిటీ

Actress | సినీ పరిశ్రమలో త‌న‌దైన‌ అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలిచే సీనియర్ నటి నీనా గుప్తా మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశారు. 60 ఏళ్లు దాటిన తరువాత కూడా యాక్టివ్‌గా సినిమాలు, ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటున్న ఆమెపై తాజాగా వచ్చిన ఒక రూమర్‌కు తానే స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. బెంగాల్‌కు చెందిన నీనా గుప్తా ఢిల్లీలో పెరిగారు. 1982లో విడుదలైన సాత్ సాత్ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమాలు, టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు. హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా ఆమె నటించారు. నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగానూ ఆమె ప్రతిభ చూపించారు.

వివాదాల మధ్య వ్యక్తిగత జీవితం

నీనా గుప్తా వ్యక్తిగత జీవితం కూడా తరచూ చర్చకు వచ్చింది. ఒకప్పుడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచార్డ్స్ తో ఆమె ప్రేమ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సంబంధం వల్ల ఆమె కుమార్తె మ‌స‌బా గుప్తా జన్మించారు. అయితే వివియన్ రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకోకుండా ఒంటరి తల్లిగానే నీనా గుప్తా తన కుమార్తెను పెంచారు. తర్వాత 2008లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు.

వైరల్ అయిన గర్భం పుకార్లు

ఇటీవల ఒక కార్యక్రమంలో నీనా గుప్తా పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో కొందరు నెటిజన్లు ఆమె గర్భవతిగా ఉన్నారని పుకార్లు పుట్టించారు. 66 ఏళ్ల వయసులో ఆమె తల్లికాబోతుందంటూ మీమ్స్, ట్రోలింగ్ కూడా మొదలయ్యాయి

ఈ రూమర్లపై నీనా గుప్తా తాజాగా స్పందించారు. ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను గర్భవతి కాదని స్పష్టం చేశారు. తాను ధరించిన ఐవరీ రంగు చీర ఫ్యాబ్రిక్ మందంగా ఉండటం వల్ల ఫోటోల్లో కాస్త బొద్దుగా కనిపించానని తెలిపారు. “నేను గర్భవతిని కాదు. చీర కారణంగా అలా కనిపించింది. దాన్ని చూసి నేను నెల తప్పానని అనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ పుకార్లు నన్ను బాధపెట్టలేదు. పైగా నవ్వు తెప్పించాయి” అని ఆమె తెలిపారు.

ఈ త వయసులో కూడా తన గురించి ఇలాంటి వార్తలు రావడం సరదాగా అనిపించిందని నీనా గుప్తా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇచ్చిన క్లారిటీతో అయినా ఈ రూమర్లకు చెక్ పడుతుందా అనేది చూడాలి.