Extra Marital Affair | 18 ఏండ్ల అల్లుడితో.. 40 ఏండ్ల అత్త వివాహేత‌ర సంబంధం

Extra Marital Affair | ఓ అత్త‌( Mother in Law )కు త‌న అల్లుడి( Son in Law )పై మ‌న‌సు ప‌డింది. ఇంకేముంది.. వ‌య‌సుతో సంబంధం లేకుండా.. అత‌న్ని లొంగ‌దీసుకుని, శారీర‌కంగా ద‌గ్గ‌రైంది. అల్లుడు కూడా అత్త‌కు బానిస అయ్యాడు. పెళ్లి( Marriage ) చేసుకునేందుకు సిద్ధ‌ప‌డ‌గా.. కూతురు( Daughter ) అడ్డుప‌డింది.

Extra Marital Affair | హైద‌రాబాద్ : ఓ అత్త‌( Mother in Law )కు త‌న అల్లుడి( Son in Law )పై మ‌న‌సు ప‌డింది. ఇంకేముంది.. వ‌య‌సుతో సంబంధం లేకుండా.. అత‌న్ని లొంగ‌దీసుకుని, శారీర‌కంగా ద‌గ్గ‌రైంది. అల్లుడు కూడా అత్త‌కు బానిస అయ్యాడు. పెళ్లి( Marriage ) చేసుకునేందుకు సిద్ధ‌ప‌డ‌గా.. కూతురు( Daughter ) అడ్డుప‌డింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్( Andhra Pradesh ) తిరుప‌తి జిల్లా( Tirupathi district )లోని కేవీబీపురం మండ‌ల ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏండ్ల బాలుడు.. 15 నెల‌ల బాలిక‌ను ఐదు నెల‌ల క్రితం ప్రేమ వివాహం( Love Marriage ) చేసుకున్నాడు. ఈ బాలిక తండ్రి కొన్నేండ్ల క్రితం చనిపోయాడు. ఇక ఒంట‌రిగా ఉంటున్న త‌ల్లి కూడా ఈ జంట వ‌ద్ద‌నే ఉంటుంది.

ఈ క్ర‌మంలో గ‌త కొద్ది రోజుల నుంచి అల్లుడిపై అత్త మ‌న‌సు పారేసుకుంది. త‌న మ‌న‌సులో మాట చెప్పింది. లొంగ‌దీసుకుంది. దీంతో అత్త‌కు అల్లుడు ద‌గ్గ‌ర‌య్యాడు. వివాహేత‌ర సంబంధం మొద‌లెట్టారు. శుక్ర‌వారం రాత్రి భార్య ప‌క్క‌న ఉండ‌గానే.. అత్తాఅల్లుడు పెళ్లి చేసుకోబోయారు. నిద్ర నుంచి ఆక‌స్మాత్తుగా మేల్కొన్న భార్య‌.. త‌న త‌ల్లికి మెడ‌లో తాళి క‌డుతున్న భ‌ర్త‌ను అడ్డుకుంది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన బాధితురాలి త‌ల్లి, భ‌ర్త క‌లిసి ఆమెపై దాడికి పాల్ప‌డ్డారు. రోక‌లి బండ‌తో త‌ల‌పై మోద‌డంతో ఆమె గ‌ట్టిగా కేక‌లు వేసింది. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని బాధితురాలిని రక్షించారు. అత్త‌, అల్లుడిపై స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Exit mobile version