Hema| హేమ సుద్ద‌పూస కాదు.. నార్కోటిక్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధార‌ణ‌

Hema| బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలను, ఇటు టాలీవుడ్ ను ఎంతగా కుదిపేస్తుందో మ‌నం చూస్తున్నాం. వాసు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారని, అందులో కొంద‌రు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. హీరో శ్రీకాంత్, నటి హేమ,

  • Publish Date - May 23, 2024 / 01:18 PM IST

Hema| బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలను, ఇటు టాలీవుడ్ ను ఎంతగా కుదిపేస్తుందో మ‌నం చూస్తున్నాం. వాసు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారని, అందులో కొంద‌రు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. హీరో శ్రీకాంత్, నటి హేమ, యాంక‌ర్ శ్యామ‌ల‌, కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ కూడా ఇందులో ఉన్నట్టు పుకార్లు వ‌చ్చాయి. అయితే వీరంతా కూడా తమకు ఆ రేవ్ పార్టీతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ముందు హేమ గురించి వార్త‌లు రాగా, ఆమె ఒక వీడియో విడుద‌ల చేస్తూ.. బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, తను హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో చిల్ అవుతున్నానని వీడియో రిలీజ్ చేసింది.

ఆ వీడియో ద్వారా తనకు బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది.తను ఇంట్లోనే ఉండి హ్యాపీగా వంట చేసుకుంటున్నట్టు బిర్యానీ తయారు చేస్తున్న ఒక వీడియోను హేమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే హేమ చేస్తున్న హంగామా చూసి అంద‌రు షాక్ అయ్యారు. అయితే పార్టీలో పాల్గొన్న నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు గుర్తించినట్లుగా సమాచారం. ఈ మేరకు నార్కోటిక్ టీమ్ రిపోర్ట్ సమర్పించింది. రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది రక్త నమూనాలు నార్కోటిక్ టీమ్ సేకరించింది. ఇందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించిన‌ట్టు వారు తెలియ‌జేశారు.

మొతంగా 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్ వ్చచింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. అలానే ఆషీ రాయ్, వాసు, హేమ స్నేహితుడు చిరంజీవి అనే వ్యక్తి శాంపిల్స్ కూడా పాజిటివ్ అయినట్లు నిర్ధారించారు. దీంతో వీరందరికీ పోలీసులు నోటీసులు పంపించిన‌ట్టు తెలుస్తుంది. వీరింద‌రిని బాధితులుగా ప‌రిగణించి ఆ త‌ర్వాత కౌన్సిలింగ్ ఇస్తార‌నే టాక్ వినిపిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేయగా 150 మంది హాజరయ్యారని స‌మాచారం. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారీ డీజే సౌండ్ రావడంతో పొరుగు వారు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

Latest News