Hema| గత కొన్ని రోజులుగా హేమ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త జన్మదిన వేడుకల్లో భారీగా డ్రగ్స్ వినియోగించినట్టు వచ్చిన ఆరోపణలుతో ఆమెని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కి తరలించారు. అయితే బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో షరతులతో కూడిన బెయిల్‌ను హేమకి మంజూరు చేశారు. దాంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే బెయిల్ లభించిన తర్వాత హేమ జైలు నుంచి బయటకు వస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. అయితే జైలు నుండి బయటకు వచ్చాక హేమ ప్రవర్తన అందరికి షాక్ ఇచ్చింది. ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వారితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా బదులు ఇచ్చింది.
హేమ మీడియాతో మాట్లాడకుండా అంత దురుసుగా ప్రవర్తించే సరికి చాలా మంది ఆమెపై పెదవి విరిచారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డిజె సిద్ధార్థ తో కలిసి హేమ దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. కేసులో ఇతడితో పాటు దాదాపుగా 16 మంది అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. అలాంటి వ్యక్తితో జైలు శిక్ష అనుభవించి వచ్చిన హేమ ఫోటో దిగడం చూసి అంతా షాక్ అవుతున్నారు. హేమ కు సిద్ధార్థ కు బెంగళూరు పార్టీకి లింక్ ఏంటి అనే విధంగా ఇప్పుడు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా పట్టుబడిన సిద్ధార్థ తో ఆమె ఫొటో దిగడంతో హేమపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ పిక్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది…
హేమని పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ కూడా ఆమెని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా హేమ పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. ఎక్కువగా వివాదాలతో వార్తలలోకి ఎక్కుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ పేరు వచ్చినప్పుడు ఆమె తాను హైదరాబాద్ లో ఉన్నట్టు, చికెన్ వండుతున్నట్టు చెప్పడం అభిమానులకి కూడా ఆగ్రహం తెప్పించింది.