Hema| బెంగ‌ళూరు జైలు నుండి విడుద‌లైన నటి హేమ‌..

Hema| గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల‌లో తెగ నానుతూ వ‌చ్చిన హేమ ఎట్ట‌కేల‌కి ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలు నుండి విడుద‌లైంది. జ్యుడీషియల్‌ కస్టడీలోఉన్న ఆమెకు బుధవారం బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై విచారణ జరిపిన బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫు

  • Publish Date - June 14, 2024 / 04:11 PM IST

Hema| గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల‌లో తెగ నానుతూ వ‌చ్చిన హేమ ఎట్ట‌కేల‌కి ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలు నుండి విడుద‌లైంది. జ్యుడీషియల్‌ కస్టడీలోఉన్న ఆమెకు బుధవారం బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై విచారణ జరిపిన బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బెయిల్ రావ‌డంతో శుక్ర‌వారం హేమ‌ని జైలు నుండి విడుద‌ల చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

గత నెల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో న‌టి హేమ‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు సమాచారంతో సెంట్రల్ క్రైమ్ పోలీసులు మెరుపుదాడి చేసి సుమారుగా 100 మందిని అదుపులోకి తీసుకొన్నారు. అయితే ఆ వందమందిలో న‌టి హేమ కూడా ఉండ‌గా, తాను హైదరాబాద్ లో ఉన్నట్లు వీడియో విడుదల చేసింది. కానీ ఆ తర్వాత పోలీసుల క్లారిటీతో ఆమె పార్టీలో పాల్గొన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె బిర్యానీ చేస్తున్న వీడియో కూడా విడుదల చేసింది.ఇక త‌మ‌కు విచార‌ణ‌లో స‌హ‌క‌రించాల‌ని నోటీసులు కూడా పంపించారు. అయితే మొద‌ట అనారోగ్యంతో ఆమె విచార‌ణ‌కి హాజ‌రు కాలేదు. త‌ర్వాత బెంగ‌ళూరు పోలీసులు రంగంలోకి దిగి ఆమెని అరెస్ట్ చేశారు.

కొద్ది రోజులుగా ఆమెను ప్రశ్నిస్తూ ఈ పార్టీకి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. అయితే బెయిల్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన హేమ కండిషన్స్ ప్రకారం పిలిచిన వెంటనే విచారణకు హాజరుకావాలని, అలాగే వెల్లడించిన పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని టాక్. అలాగే కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదనే షరతును కూడా విధించినట్టు సమాచారం.

Latest News