Nani | చిత్ర పరిశ్రమలో హీరోలకు ఉన్న మార్కెట్‌ను బట్టి నిర్మాతలు బడ్జెట్‌ని డిసైడ్ చేస్తుంటారు. హీరోతో పాటు దర్శకుడి కాంబోతో పాటు కథను దృష్టిలో పెట్టుకొని మార్కెట్‌కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తుంటారు. కథ డిమాండ్.. క్వాలిటీ తెరపై కనిపించి ప్రేక్షకులు ఆదరిస్తే కలెక్షన్ల రూపంలో పెట్టుబడులు తిరిగి వస్తాయి. లేకపోతే ప్రొడ్యూసర్‌కు నష్టాలు తప్పవు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల మార్కెట్ పెరిగింది. దాంతో ఖర్చులు సైతం భారీగా పెరిగాయి. అయితే, న్యాచురల్ స్టార్ నాని తన సినిమాల నిర్మాణంలో నిర్మాతకు కీలక విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తున్నది. ఖర్చు విషయంలో వెనకాడొద్దని.. కథ డిమాండ్ నేపథ్యంలో రాజీపడకుండా ఖర్చుల విషయంలో వెనక్కి తగ్గొద్దని సూచించినట్లు సమాచారం.
ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. నాని కెరీర్‌లో ఇది 33వ సినిమా. ప్రస్తుతం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. నాని, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా మూవీకి మించి మాస్ ఎలిమిమెంట్స్, డెఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించనున్నారు. ఈ క్రమంలో ఖర్చు విషయంలో రాజీపడొద్దని.. కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టాలని.. దర్శకుడు అడిగిన ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేయాలని నిర్మాత సుధాకర్ చెరుకూరికి నాని కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తున్నది. ఇక నాని ప్రస్తుతం శైలేస్ కొలను దర్శకత్వంలో హిట్-3 మూవీలో నటిస్తున్నాడు. అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి, అడివి శేషు, నివేథా థామస్ కీలకపాత్రల్లో నటించనున్నారు.