Inaya sulthana| బిగ్ బాస్ షోతో పాపులారిటీ దక్కించుకున్న వారిలో ఇనయ సుల్తానా ఒకరు. ఈ అమ్మడు ముందుగా రాంగోపాల్ వర్మతో మందు పార్టీలో డ్యాన్సులు వేస్తూ కొంత పాపులారిటీ దక్కించుకుంది. పలు సినిమాలలో కూడా నటించింది. అయితే వాటితో ఈ భామ గుర్తింపు దక్కలేదు. బిగ్ బాస్ షోలో అడుగుపెట్టినప్పటి నుండే ఇనయ పేరు మారుమ్రోగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఈ భామ సోలోగా గేమ్ ఆడింది. ఆర్జే సూర్యని ఘాడంగా ప్రేమించింది. అతనిపై ఉన్న ప్రేమ వలన గేమ్‌పై ఫోకస్ తగ్గించింది. నాగార్జున వార్నింగ్ ఇవ్వడంతో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. ఇక గేమ్‌పై ఫోకస్ పెడుతూ 14వ వారం వరకు సాగింది.ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక ఆర్జే సూర్యతో కలిసి కనిపించింది కూడా లేదు.
ఇప్పుడు ఈ భామ యోగ ఎక్స్పర్ట్‌తో ప్రేమలో పడింది. అతని పేరు గౌతమ్ కొప్పిశెట్టి కాగా, జిమ్ లో ఏర్పడిన పరిచయాన్ని ఈ ఇద్దరు ప్రేమగా మార్చుకున్నారు.ఇక ఈ జంట గోవా కూడా వెళ్లారు. అక్కడ తెగ ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌కి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఇనయా సుల్తానా ప్రియుడుతో బెడ్‌రూంలో ఉన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.. బెడ్ రూమ్‌లో టవల్ కట్టుకొని, తన ప్రియుడితో సెల్ఫీకీ ఫోజు ఇచ్చింది. వీటిని చూసిన నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారుగా అని కామెంట్ చేస్తున్నారు.
ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ లేపుతుంటుంది. అమ్మడి పిక్స్ చూసి కుర్రకారుకి పిచ్చెక్కిపోతుంటుంది. సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలతో రచ్చ చేసే బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ఒక్కోసారి నెటిజన్స్ నుండి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ మధ్య పలు సినిమాలు షోలలో కూడా కనిపించిన ఇనయ ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంది.