OTT| ఇండిపెండ‌న్స్ డే స్పెష‌ల్.. ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి

OTT| మ‌రో రెండు రోజుల‌లో స్వాతంత్ర్య దినోత్స‌వం రాబోతుంది. థియేటర్ల దగ్గర మళ్లీ పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం డబుల్ ఇస్మార్ట్‌, మిస్టర్‌ బచ్చన్‌ లాంటి క్రేజీ సినిమాలు ఆగస్టు 15న విడుదలవుతున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్‌ సినిమా కూడా ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రి కొన్ని చిత్రాలు కూడా సంద‌డి చేయ‌నుండ‌గా, ఓటీటీలో కూడా సంద‌డి ఓ రేంజ్‌లో ఉండ‌బోతుంది.