Site icon vidhaatha

Indian 2|ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్న ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌, రామ్ చ‌ర‌ణ్‌..ఈవెంట్ ఏంటంటే..!

Indian 2|ఇద్ద‌రు దిగ్గ‌జాలు, ఒక గ్లోబ‌ల్ స్టార్ ఒకే వేదిక‌పై క‌నిపించి సంద‌డి చేయ‌బోతున్నారు. ఆ దిగ్గ‌జాలు క‌మ‌ల్ హాస‌న్, ర‌జ‌నీకాంత్ కాగా, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. వీరు ముగ్గురు ఏ వేదిక‌పై సంద‌డి చేయబోతున్నారంటే..ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో. లోకనాయకుడు కమల్ హాసన్​, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’ ( ఇండియన్ 2). ఈ మూవీ చాన్నాళ్లుగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అయితే ఎట్ట‌కేల‌కి ఈ మూవీని జూన్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక జూన్‌లో చిత్ర రిలీజ్ ఉండ‌డంతో మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ శ‌ర‌వేగంగా జ‌రుపుతున్నారు.

ఇండియ‌న్ 2 ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌లో భాగంగా ఆడియో లాంఛ్​ ఈవెంట్ మే 16న నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రాండ్ లాంఛ్​కు గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్‌ అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని ప్ర‌స్తుతం ఓ టాక్ వినిపిస్తుంది.ఇండియన్ 2కి బజ్ పెంచడానికి దీన్ని మొదటి మెట్టుగా వాడుకోబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం దాదాపు ఫిక్సైనట్టేనని చెన్నై మీడియా టాక్. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన గేమ్ ఛేంజర్ ఎలాగూ దర్శకుడు శంకర్ తీస్తోందే కావడంతో చరణ్ నో చెప్ప‌డం అనేది జ‌ర‌గ‌దు. మ‌రోవైపు క‌మ‌ల్‌, ర‌జ‌నీ మ‌ధ్య మంచి బాండింగ్ ఉన్న నేప‌థ్యంలో త‌లైవా రావ‌డంలో కూడా డౌటే లేదు అంటున్నారు.

కల్కి ఏడి 2898 రిలీజ్ డేట్ వచ్చేసింది కాబ‌ట్టి దానికి రెండు వారాల ముందు భార‌తీయుడు2 సినిమాని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. ఇండియ‌న్ 2ని శంక‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో కమల్​తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బ్రహ్మానందం, ఎస్‌జే సూర్య, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, బాబీ సింహా, మధుబాల, కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జేయింట్స్​ బ్యానర్​పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, లైకా సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీకి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, గ్లింప్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి.

Exit mobile version