Site icon vidhaatha

INDIAN 2| శంక‌ర్ ఈజ్ బ్యాక్.. క‌మ‌ల్ హాస‌న్‌తో అద్భుతాలు చేయించాడుగా..!

INDIAN 2|  యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం భార‌తీయుడు2. ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అమెరికాలో ఇండియన్ 2 సినిమా ఫస్టాఫ్ పూర్తి కాగా, ట్విట్ట‌ర్‌లో మూవీకి సంబంధించి కొంద‌రు రివ్యూలు ఇస్తున్నారు. సిద్ధార్థ్ మీద సినిమా ఓపెన్ అవుతుంది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి మీద సిద్ధార్థ్ తన టీమ్ తో కలిసి వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. శంకర్ ఎక్క‌డ కూడా లాగ‌కుండా ప్రారంభ సన్నివేశాల్లో డైరెక్ట్‌గా కథలోకి వెళ్ళాడట.

సేనాపతి ( పాత‌ కమల్ హాసన్) అవినీతికి పాల్పడుతున్న కొడుకును చంపి విదేశాలకు వెళ్లిపోవడంతో పార్ట్ 1 ముగుస్తుంది. పార్ట్ 2 అక్కడి నుండే మొదలుపెట్టాడు. విదేశాల నుండి కమల్ హాసన్ ఇండియాకు దిగి అప్పుడు తన పోరాటం మరోసారి మొదలుపెడతాడు. చిత్రంలో శంకర్ మార్కు ఎలిమింట్స్ తక్కువగా కనిపించాయి. ఫస్టాఫ్ సినిమా యావరేజ్‌గా ఉంది అంటున్నారు. భారతీయుడు సినిమాలో ఉన్న మ్యాజిక్ ఫస్టాఫ్‌లో కనిపించలేదని కాక‌పోతే, అనిరుధ్ మ్యూజిక్, గ్రాండియన్ విజువల్స్ బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వృద్దుడిగా కమల్ హాసన్ గెటప్ ఫస్ట్ హాఫ్ లో అంతగా ఆక‌ట్టుకోలేక‌పోయింద‌ని టాక్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

శంకర్ స్క్రీన్ ప్లే మూస యాంగిల్‌లో సాగింద‌ని, ఇది ప్రేక్ష‌కుల‌ని అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోతుందని సోష‌ల్ మీడియాలో టాక్ న‌డుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తాయి. పెద్ద పెద్ద డైలాగులు, సాగదీతతో కూడిన సన్నివేశాలు నిరాశపరుస్తాయట. సెకండ్ హాఫ్ పర్లేదు అంటున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ మూవీకి హైలెట్ అట. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, ఎస్ జె సూర్య, బాబీ సింహ తమ పాత్రలకు న్యాయం చేశారని టాక్ న‌డుస్తుంది. భార‌తీయుడు 2 చిత్రం ప‌ర్లేదు అని అంటున్నారు త‌ప్ప శంక‌ర్ రేంజ్ మూవీ కాద‌ని, భార‌తీయుడు 1 మూవీని మ‌రిపించ‌లేక‌పోయింద‌ని అంటున్నారు. ఈ త‌రం జ‌న‌రేష‌న్ భార‌తీయుడు1 పెద్దగా చూసి ఉండ‌రు కాబ‌ట్టి, ఈ మూవీని వారు ఎంజాయ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

Exit mobile version