Site icon vidhaatha

అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ కంటిన్యూ..!?

విధాత: సినీ పరిశ్రమలో బావ, బామ్మర్ధులుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల బంధం క్రమంగా బలహీన పడుతుందా అంటే ఇటీవల పరిణామాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన మిత్రుడు నంద్యాల నుండి వైసీసీ అభ్యర్థి అయిన శిల్పా రవి చంద్ర కిషోర్ కు మద్దతుగా ప్రచారం చేయడంతో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలకు బీజం పడింది. పుష్ప 2 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వివాదంతో ఆ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అల్లు అర్జున్‌ అరెస్ట్ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ కారణాలేమైనా అతడిని పరామర్శించలేదు. పైగా తొక్కిసలాట..అరెస్టు వివాదంలో అర్జున్ ను తప్పుపట్టే రీతిలో నర్మగర్భంగా పవన్ వ్యాఖ్యలు చేయడం వారి మధ్య విభేదాలను చాటింది.

“పుష్ప 2” విడుదలై రికార్డు స్థాయిలో విజయం సాధించి, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచినప్పటికి మెగా కుటుంబం నుంచి బహిరంగంగా అభినందనలు వెల్లడి కాలేదు. అయితే ఇటీవల లైలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పుష్ప 2 బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలుగు పరిశ్రమకు గర్వకారణమన్నారు. ఈ ప్రకటన సహజంగానే అల్లు అర్జున్ అభిమానులను ఆనందపరిచింది. అల్లు, మెగా ఫ్యామిలీల ఐక్యతను కోరుకునే అభిమానులు చిరంజీవి వ్యాఖ్యలను స్వాగతించారు.

అనంతరం రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం గురించి అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇరుకుటుంబాల మధ్య వైరాన్ని రాజేశాయి. అయితే తన వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం జరిగాయంటూ అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. నిర్మాత దిల్ రాజు ఐటీ దాడులతో ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించే క్రమంలో రామ్ చరణ్ ను తక్కువ చేసినట్లుగా తాను మాట్లాడినట్లుగా అనిపించిందని..ఇందుకు మెగా అభిమానులు బాధపడితే, నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను” అని అల్లు అరవింద్ స్పష్టతనిచ్చారు. రామ్ చరణ్ నాకు కొడుకు లాంటివాడని..అతను నా ఏకైక మేనల్లుడని.. మా సంబంధం అద్భుతమైనదని గుర్తు చేశారు. అంతటితో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ సద్ధుమణిగిందని అంతా భావించినప్పటికి లోలోనా మాత్రం అలాగే ఉన్నట్లుగా తాజా ఘటనలు చాటుతున్నాయి.

ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మెగా హీరోల నుంచి విషెస్ అందకపోవడాన్ని అల్లు అభిమానులు ఎత్తి చూపుతున్నారు. అటు పవన్ కల్యాణ్ చిన్నకొడుకు మార్క్‌ శంకర్ సింగపూర్ లో అగ్ని ప్రమాదంలో గాయపడటంపై అల్లు కుటుంబం నుంచి సానూభూతి ప్రకటన వెల్లడి కాలేదని మెగా అభిమానులు గుర్తు చేస్తున్నారు. పవన్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్‌ వంటి వారు సానుభూతి తెలిపారని..అల్లు కుటుంబం నుంచి అటువంటి ప్రకటన ఏది వెలువడలేదని ఇది అల్లు, మెగా ప్యామిలీల మధ్య గ్యాప్ కు నిదర్శనమంటున్నారు సినీ విశ్లేషకులు.

Exit mobile version