Rashmi gautham| జబర్ధస్త్ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తర్వాత బుల్లితెరపై తనదైన శైలిలో యాంకరింగ్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. సుడిగాలి సుధీర్‌తో రష్మీ పండించే వినోదం మరో లెవల్. వీరిద్దరి లవ్ ట్రాక్ ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటుంది. బుల్లితెరపై యాంకర్‌గా కొనసాగుతున్న రష్మీ.. మరోవైపు సినిమాల్లో ఛాన్స్ లు కూడా దక్కించుకుంటుంది. చివరిగా ‘భోళా శంకర్’ సినిమాలో రొమాంటిక్ రోల్ చేసి అందరిని మెప్పించింది.అయితే రష్మీ ఈ స్థాయికి చేరడానికి చాలా కష్టపడింది.
రష్మీ ప్రస్తుతం జబర్థస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు కూడా యాంకర్‌గా వ్యవహరిస్తుంది. తెరపై ఎంతో సరదాగా నవ్వుతూ, నవిస్తూ ఉండే రష్మి వెరీ ఎమోషనల్ పర్సన్ కూడా. చుట్కీ..రష్మీ పెంపుడు జంతువు కాగా, ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించింది. అప్పుడు చాలా ఎమోషనల్ అయింది. ఇక ఇదిలా ఉంటే అనసూయ, రష్మీ ఇద్దరు కలిసి జబర్ధస్త్‌కి పని చేయగా, అనసూయ సినిమాల కోసం షోని వదిలి పెట్టి వెళ్లింది. రష్మి గౌతమ్ మాత్రం జబర్దస్త్‌ను వదిలిపెట్టలేదు. ప్రస్తుతం రష్మి జబర్ధస్త్ షోతో చాలా బిజీగా ఉంది.రీసెంట్‌గా జూన్ 21,22న ప్రసారం కానున్న షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఆటో రామ్ ప్రసాద్ రష్మీకి సంబంధించిన షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అయితే అదంతా స్కిట్ లో భాగంగానే జరిగింది.
ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేసారనే భాదలో విషం తాగబోతే, యాజమాన్యం ఆపి రెండు ఎపిసోడ్లు నువ్వే చేస్తావు అని చెప్పగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది అంటూ న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా చెప్పేశాడు ఆటో ప్రసాద్. ఫన్నీగా ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికి నవ్వులు పూయించాయి. ఆటో రామ్ ప్రసాద్ మాటలకి రష్మీ కూడా తెగ నవ్వేసింది. ప్రోమోనే ఈ రేంజ్‌లో ఉంటే ఇక ఎపిసోడ్ మరో లెవల్‌లో ఉంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు.