Jabardasth| జబర్ధస్త్ షోతో అనసూయ, రష్మీలు ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనం చూశాం.అనసూయకి సినిమా అవకాశాలు రావడంతో ఆమె జబర్ధస్త్ నుండి తప్పుకోగా, రష్మీ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది. అయితే అనసూయ స్థానంలో కొత్త యాంకర్స్ వచ్చి సందడి చేయగా, వారిలో సిరి కూడా ఒకరు.ఆమె యూట్యూబర్‌గా ముందు గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ అంది పుచ్చుకుంది. బిగ్ బాస్ షోలో షణ్ముఖ్‌తో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ షో తర్వాత సిరికి బుల్లితెరపైన అటు వెండితెరపైన మంచి అవకాశాలు వస్తున్నాయి.
జబర్ధస్త్‌లో సౌమ్యరావు స్థానంలో వచ్చిన సిరి.. బాగానే అలరించింది. కానీ అనసూయ లేని లోటుని భర్తీ చేయలేకపోయింది. అయితే రెండు జబర్దస్త్ ల్లో ఒక షోని ఆపేయడంతో సిరి బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు తాను ఏం చేస్తుంది అనే దానిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు తెలిపింది సిరి. ఆ చిత్రం కూడా జవాన్ రేంజ్‌లోనే ఉంటుందని తెలియజేసింది. అలానే శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు పేర్కొంది. మరో కొత్త ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉందని వెల్లడించింది. శ్రీహాన్, శేఖర్ మాస్టర్‌లతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టు తెలిపింది.
ఈ వెబ్ సిరీస్‌లో తనకు శ్రీహాన్‌తో రొమాన్స్ చేయడం ఉండదని, ఆయనకు మరో అమ్మాయితో రొమాన్స్ ఉంటుందని పేర్కొంది. శ్రీహాన్, సిరి ఇద్దరు ప్రేమలో ఉండగా, వారు చాలా రోజులుగా సహజీవనం చేస్తున్నారు. గతంలో సిరి ఓ వ్యక్తిని ప్రేమించగా, అతను ప్రమాదంలో చనిపోయారు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఈ భామ శ్రీహాన్‌కి దగ్గరైంది. అప్పటి నుండి ఇద్దరు కూడా పీకల్లోతు ప్రేమలో ఉండగా, ఒకరినొకరు బాగా అర్ధం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. శ్రీహాన్, సిరి ఇద్దరు కూడా కెరీర్‌లో బాగానే సెటిల్ అయ్యారు.