NTR| దివంగత నటుడు ఎన్టీఆర్ తన నటనతో అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి చాలా మంది స్టార్ హీరోయిన్స్ పని చేశారు. వారిలో జయసుధ, వాణిశ్రీ, జయప్రద వంటి వారు పలు సందర్భాలలో ఎన్టీఆర్ గురించి గమ్మత్తైన విషయాలు చెబుతూ అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. సీనియర్ నటి జయప్రద ఓ సందర్భంలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్, జయప్రద ఇద్దరు కలిసి యమగోల, అడవిరాముడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు. వారి కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉండేది. అయితే ఓ షోలో జయప్రదతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనగా, ఆ సమయంలో ఎన్టీఆర్‌తో డ్యాన్స్ గురించి జయప్రద షాకింగ్ కామెంట్స్ చేసింది.
యమగోల చిత్రంలో ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ సాంగ్ ఆడియన్స్‌ని హుషారెత్తేలా చేసింది. ఈ పాట వస్తే ఇప్పటికీ మైమరచిపోతుంటారు. అయితే ఇదే పాటని జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఆ రోజుల్లో అది పెద్ద హిట్ సాంగ్. ఆ సాంగ్ లో మీ తాతగారితో కలసి నటించడం నా అదృష్టం అని జయప్రద చెప్పుకొచ్చింది. అయితే పాట షూటింగ్ తర్వాత నాకు ఒళ్లంతా నొప్పులు, మూడు రోజుల పాటు హై టెంపరేచర్ ఫీవర్ వచ్చింది. సాంగ్‌లో మీ తాత గారు అంతలా గుద్దుతూ డ్యాన్స్ చేశారు అంటూ నవ్వుకుంటూ చెప్పింది. అయితే దానికి జూనియర్ ఎన్టీఆర్ నవ్వేసి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
యమదొంగ చిత్రంలో నేను సన్నగా ఉన్నాను. అంతకు ముందులాగా లావుగా ఉండిఉంటే మా హీరోయిన్ పని కూడా మీ లాగే అయి ఉండేదేమో అంటూ ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్ చేశారు. నేను సన్నగా ఉండడం వలన మా హీరోయిన్‌కి అంత సమస్య ఎదురు కాలేదని ఆయన సరదాగా చెప్పుకు వచ్చారు. అయితే యమదొంగ చిత్రంలో ఓలమ్మి తిక్కరేగిందా పాటని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా పాడిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు దేవర అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రూపొందుతుంది. తొలి పార్ట్‌ని దసరా కానుకగా విడుదల చేయనున్నారు.