Jigrees Movie| యూత్‌ని ఆకట్టుకునేలా ‘జిగ్రీస్‌’.. విడుదల తేదీ ఫిక్స్!

'జిగ్రీస్‌' సినిమా నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. త్వరలోనే చిత్ర ప్రచార కార్యక్రమాలు మరింత జోరు అందుకోనున్నాయి. యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని సందీప్ రెడ్డి వంగా నమ్మకం వ్యక్తం చేశారు.

Jigrees Movie| ఈ నగరానికి ఏమైంది’ తరహా ఫీల్‌తో రాబోతున్న మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్ ‘జిగ్రీస్‌'(Jigrees Movie). యువ నటులు రామ్‌ నితిన్‌, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్‌ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. హరీష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించారు.

వంగా సపోర్ట్..
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన విజయాలు సాధించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు సపోర్ట్ అందిస్తుండడం విశేషం. దర్శకుడు హరీష్‌ రెడ్డి సందీప్ రెడ్డి చిన్ననాటి స్నేహితుడు కావడంతో, వంగా దగ్గరుండి మరీ ‘జిగ్రీస్‌’ ప్రమోషన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసిన టీజర్ యువతను బాగా ఆకట్టుకుంది. అలాగే యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం చేతుల మీదుగా విడుదలైన సాంగ్ కూడా జనాల్లోకి వెళ్లింది.

ప్రభాస్ పుట్టినరోజున.. విడుదల తేదీ ప్రకటన!
బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని ఈరోజు ప్రకటించారు. నేడు రెబల్ స్టార్ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా, ‘జిగ్రీస్‌’ చిత్ర యూనిట్ ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అదే పోస్టర్ ద్వారా సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించడం హైలైట్.

‘జిగ్రీస్‌’ సినిమా నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. త్వరలోనే చిత్ర ప్రచార కార్యక్రమాలు మరింత జోరు అందుకోనున్నాయి. యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని సందీప్ రెడ్డి వంగా నమ్మకం వ్యక్తం చేశారు.