Kajal Aggarwal | టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చందమామ మూవీతో తెలుగులోకి ఇంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత తమిళం, హిందీ చిత్రాల్లోనూ నటించి మంచి పేరు సంపాదించుకున్నది. ప్రస్తుతం ‘సత్యభామ’గా తెలుగు అభిమానులను పలుకరించబోతున్నది. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ ఓ టీవీషో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తన కెరియర్‌కు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నది. ‘లక్ష్మీ కల్యాణం’ మూవీతో దర్శకుడు తేజ పరిచయం చేశారని.. ఆ తర్వాత ఆయన సినిమాల్లో ‘నేనేరాజు నేనే మంత్రి’, ‘సీత’ సినిమాలు చేశానని చెప్పింది.
డైరెక్టర్‌గా ఆయన స్టయిల్ డిఫరెంట్‌గా ఉంటుందని తెలిపింది. రాజమౌళి, కృష్ణవంశీ దర్శకత్వంలోనూ పని చేశానంది. అలాంటి దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టమేనని.. ఒక్కో దర్శకుడిది ఒక్కో రకమైన పద్ధతని పేర్కొంది. ఈ ముగ్గురు దర్శకుల నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నది టాలీవుడ్ చందమామ. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీలో కలిపి మొత్తం 65 సినిమాలు చేశానని.. ప్రేక్షకుల అభిమానంతో ఇంత జర్నీ సాధ్యమైందని అనుకుంటున్నాని తెలిపింది.
సత్యభామ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పని చేశానని.. ఇలాంటి పాత్ర చేయడం మొదటిసారని.. ఈ సినిమా తప్పకుండా అభిమానులకు కనెక్ట్ అవుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. కాజల్ అగర్వాల్ చివరిసారిగా భగవంత్ కేసరి చిత్రంలో కనిపించింది. సత్యభామ మూవీలో నటిస్తుండగా వచ్చే జూన్ 7న విడుదలకు సిద్ధమైంది. అలాగే కాజల్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నది. ఇందులో ఒకటి విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు-2లో కీలక పాత్రలో నటిస్తున్నది. హిందీలో ఉమ చిత్రంలో కనిపించనున్నది.