విధాత : టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందిన సీనియర్ నటి కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాతా లైఫ్ ను ఎంజాయ్ చేస్తునే ఇంకోవైపు ప్రత్యేక పాత్రలతో అభిమాలను అలరిస్తుంది. తాజాగా కాజల్ మాల్ధీవుల్లో భర్త గౌతమ్, కొడుకు నీల్ తో కలిసి బీచ్ లో చిల్ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్లను షేక్ చేసింది. బికినీలో కాజల్ మోస్ట్ రోమాంటిక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భర్తతో బీచ్ లో రొమాన్స్..కొడుకుతో బీచ్ లో నడక ఫోటోలను ఆమె సోసల్ మీడియాలో పంచుకుంది. 2020లో కాజల్, గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. తరచుగా కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంటూ నెటిజన్లకు కనువిందు చేయడం చేస్తుంది. తాజాగా మాల్ధీవుల పర్యటనకు వెళ్లిన కాజల్ మాల్దీవులపై నా ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు అని..ప్రకృతిని ఎంతో గ్లామరస్ గా చూపించే ప్రదేశం అది అని పేర్కొంది. మాల్దీవులకు వెళ్లిన ప్రతిసారి నాకు కొత్త అనుభూతి కలుగుతుంది అని కాజల్ పోస్ట్ చేసింది.
కాజల్ అగర్వాల్ 2007లో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి, రాంచరణ్ ల మగధీర మూవీ కాజల్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ తర్వాత కాజల్.. అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, నాగ చైతన్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా స్టార్ హీరోలందరితో నటించింది. రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో రాణిస్తున్న కాజల్ అగర్వాల్ సౌత్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు పొందింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో మండోదరి పాత్రలో నటిస్తుండడం విశేషం.