KALKI 2898 AD| క‌ల్కి వీర‌విహారం..రూ.500 కోట్లు కొల్ల‌గొట్టిన ప్ర‌భాస్ చిత్రం

KALKI 2898 AD| ఇండియన్ లెజెండ్స్, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, ప్రభాస్, దీపిక పదుకోనే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెకెక్కించిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దండయాత్ర చేస్తున్నది. జూన్‌ 27న విడుదలైనప్పటి నుంచి క‌ల్కి మూవీ బాక్సా

  • Publish Date - July 1, 2024 / 12:24 PM IST

KALKI 2898 AD| ఇండియన్ లెజెండ్స్, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, ప్రభాస్, దీపిక పదుకోనే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెకెక్కించిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దండయాత్ర చేస్తున్నది. జూన్‌ 27న విడుదలైనప్పటి నుంచి క‌ల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. నాలుగో రోజైన ఆదివారం నాడు గత రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఆదివారం రోజు చిత్రానికి రూ. 85 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి.తెలుగు నుంచి రూ. 36.8 కోట్లు, తమిళంలో 5.5 కోట్లు, హిందీ నుంచి ఎక్కువగా రూ. 39 కోట్లు, కర్ణాటక నుంచి 70 లక్షలు, మలయాళం నుంచి రూ. 3 కోట్ల వరకు వ‌చ్చాయి.

కల్కి 2898 ఏడీ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 415 కోట్లు కొల్లగొట్టగా.. 4 రోజుల్లో రూ. 500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తుంది.కల్కికి ఇండియా డొమెస్టిక్ కలెక్షన్స్ రూ. 300 కోట్లకుపైగా వచ్చాయి. అలాగే కల్కి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 4 రోజుల్లో రూ. 500 కోట్ల వరకు వచ్చినట్లుగా ప్రముఖ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. 302 కోట్లల్లో తెలుగు భాషలో రూ. 162.1 కోట్లు, తమిళం-18 కోట్లు, హిందీ-110.5 కోట్లు, కర్ణాటక-1.8 కోట్లు, మలయాళం నుంచి 9.7 కోట్ల కలెక్షన్స్ వసూలు అయ్యాయి. కాగా కల్కి 2898 ఏడీ దక్షిణాది భాషలన్నింటిలోనూ, హిందీలోనూ 2డీ, 3డీలో విడుదలైంది. అంత‌టా కూడా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తొలి రోజు 66 కోట్ల రూపాయలు, రెండో రోజు 29 కోట్ల రూపాయలు, మూడో రోజు 31 కోట్ల రూపాయలు వసూళ్లు రాబ‌ట్టింది. హిందీలో తొలి రోజు 23 కోట్లు, రెండో రోజు 23 కోట్లు, మూడో రోజు 26 కోట్ల రూపాయ‌లు రాబ‌ట‌టింది. తమిళంలో తొలి రోజు 5 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.5 కోట్లు, మూడో రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే నాలుగో రోజు చూస్తే.. ఈ చిత్రానికి తెలుగులో 84.24 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ పాత్ర చేయగా అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేశారు.

 

 

Latest News