Kalki 2898 AD| క‌ల్కి ఈవెంట్ హైలైట్స్.. ఇదంతా ప్ర‌భాస్ వ‌ల్లేనంటూ బేబి బంప్ చూపిస్తూ దీపికా షాకింగ్ కామెంట్స్

Kalki 2898 AD| గ‌త కొద్ది రోజులుగా క‌ల్కి మూవీ తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. జూన్ 27న మూవీని భారీ ఎత్తున విడుద‌ల చేయ‌నుండ‌గా, ప్ర‌మోష‌న్స్ ఓ రేంజ్‌లో నిర్వ‌హిస్తున్నారు.

  • Publish Date - June 20, 2024 / 06:41 AM IST

Kalki 2898 AD| గ‌త కొద్ది రోజులుగా క‌ల్కి మూవీ తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. జూన్ 27న మూవీని భారీ ఎత్తున విడుద‌ల చేయ‌నుండ‌గా, ప్ర‌మోష‌న్స్ ఓ రేంజ్‌లో నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ముంబైలో కల్కి ప్రీ రిలీజ్‌ను ఈవెంట్‌ను గ్రాండ్‌ నిర్వహించింది మూవీ టీం. బుధవారం జూన్‌ 19న జరిగిన ఈ వెంట్‌లో హ్యాండ్సమ్‌ హాంక్‌ రానా దగ్గుబాటి అంద‌రితో ప‌లు విష‌యాల గురించి ముచ్చ‌టిస్తూ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు రాబ‌ట్టాడు. దీపికా అయితే త‌న పొట్ట‌కి కార‌ణం ప్రభాస్ అని చెప్ప‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌భాస్ ప్ర‌తి రోజు ఇంటి నుండి భోజ‌నం తెచ్చేవాడ‌ని, ఎంతో ఇష్టంగా టీం అందరికి భోజనం పెట్టేవాడ‌ని దీపికా పేర్కొంది. తాను ఇలా అవ్వ‌డానికి కార‌ణం ప్ర‌భాస్ ఇంటి భోజనమే అన్న‌ట్టు తన బేబీ బంప్‌ను చూపిస్తూ స‌రదా కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ.

ఇక దీపికా స్టేజ్‌పైన మాట్లాడి కింద‌కు దిగుతున్న స‌మ‌యంలో ప్ర‌భాస్ వ‌చ్చి ఆమె చేతిని ప‌ట్టుకుని మెల్లిగా కింద‌కి న‌డిపించే ప్ర‌య‌త్నం చేశారు. అప్పుడు అమితాబ్ ప్ర‌భాస్‌ని ప‌క్క‌కు జ‌రిపి ఆమె చేతిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది. ఇక అమితాబ్ గురించి మాట్లాడిన ప్ర‌భాస్.. సెట్‌లో ఆయ‌న‌ని క‌లిసిన‌ప్పుడు కాళ్లకి దండం పెట్ట‌బోతుంటే.. నువ్వు నాళ్ల‌కి మొక్కితే నేను నీ కాళ్ల‌కు మొక్కుతా అన్నారు. ఆయ‌న అలా అనే స‌రికి నాకేమి అర్ధం కాలేదు. అమితాబ్ దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన తొలి యాక్ట‌ర్. అప్ప‌ట్లో ఆయ‌న హెయిర్ స్టైల్‌, హైట్ గురించే ఎక్కువ‌గా మాట్లాడుకునేవారు.. ఇక కమల్ సర్ సాగరసంగమం చూసి అలాంటి డ్రెస్ కావాల‌ని మా అమ్మ‌ని అడిగాను. ఇంద్రుడు చంద్రుడు చూసి డ్రెస్ లోప‌ల క్లాత్ చుట్టుకొని అలా న‌టించే ప్ర‌య‌త్నం చేశాను. దీపిక‌తో న‌టించడం మంచి ఎక్స్‌పీరియ‌న్స్ అని ప్ర‌భాస్ చెప్పుకొచ్చాడు.

క‌మ‌ల్ మాట్లాడుతూ.. చిత్రంలో త‌న‌ది నెగెటివ్ రోల్ అని అన్నారు. నాగ్ అశ్విన్ మా గురువు బాల‌చంద‌ర్ మాదిరిగా త‌న ఐడియాని అద్భుతంగా ప్ర‌జెంట్ చేయ‌గ‌ల‌డు. దీపికాని ఉద్దేశిస్తూ.. సినిమాలో దీపికా న‌టించ‌క‌పోతే నేను ప్ర‌గ్నెంట్‌గా క‌నిపించాల‌ని అనుకున్నానంటూ స‌ర‌దా కామెంట్ చేశారు. క‌మ‌ల్ మాట‌ల‌తో దీపికా ఈ మూవీలో ప్ర‌గ్నెంట్‌గానే క‌నిపిస్తుందా అనే అనుమానాలు అంద‌రిలో త‌లెత్తాయి. ఇక ఈవెంట్‌లో చిత్ర నిర్మాత అశ్వినీద‌త్‌.. అమితాబ్ కాళ్లకి న‌మ‌స్క‌రించ‌పోతే ఆయ‌న పక్క‌కి జ‌రిగారు. ఈవెంట్ పూర్త‌య్యాక కల్కి టికెట్‌ని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్ డబ్బులు ఇచ్చి తొలి టికెట్‌ కొనుగోలు చేశారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై నిర్మాత అశ్విని దత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Latest News