Kalki 2898 AD| బాబోయ్ క‌ల్కి మూవీ ఒక్క టికెట్ రూ.2300.. ఎక్క‌డో తెలుసా?

Kalki 2898 AD| ఎన్నో రోజుల నుండి క‌ల్కి మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, ఈ మూవీ నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాని చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బారులు తీరారు. తొలి రోజే సినిమాని చూ

  • Publish Date - June 27, 2024 / 07:15 AM IST

Kalki 2898 AD| ఎన్నో రోజుల నుండి క‌ల్కి మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, ఈ మూవీ నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాని చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బారులు తీరారు. తొలి రోజే సినిమాని చూడాలని చాలా ఆస‌క్తిగా ఉన్నారు. టికెట్ రేటు ఎంత ఉన్నా స‌రే మూవీ చూసి తీరాల్సిందే అంటున్నారు. క‌ల్కి సినిమా బుక్ మై షోలో వ‌దిలిన కొద్ది గంట‌ల‌లోనే 70 వేల టిక్కెట్స్ అమ్ముడుపోయాయి అంటే అర్ధం చేసుకోవ‌చ్చు. క‌ల్కి హవా ఏ రేంజ్‌లో ఉందో.ఇక క‌ల్కి క్రేజ్‌ని క్యాష్ చేసుకొని కొన్ని చోట్ల భారీ రేట్ల‌కి అమ్ముతుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

ముంబై మైన‌స్ ఐనాక్స్ లోని జియో వ‌ర‌ల్డ్ ప్లాజాలో క‌ల్కి మూవీ ఒక్కో టిక్కెట్‌ని రూ.2300 రూపాయ‌ల‌కి అమ్మిన‌ట్టు స‌మాచారం. ఒక్క టిక్కెట్ ధ‌ర అంత‌నా అంటూ అంద‌రు నోరెళ్ల‌పెడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల‌లో సైతం క‌ల్కి టిక్కెట్స్‌ని భారీ రేట్ల‌కి అమ్ముతున్న‌ట్టుగా తెలుస్తుంది. క‌ల్కి మొద‌టి షో ప‌డితే కాని సినిమా పరిస్థితి ఏంట‌న్న‌ది తెలియ‌దు. సినిమా బాగుంటే మాత్రం టిక్కెట్ రేట్స్ మ‌రింత పెరిగే అవకాశం కూడా ఉంది. స‌లార్ వంటి భారీ హిట్ త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న చిత్రం ఇది. మల్టీఫ్లెక్స్‌లలో రూ.400 నుండి రూ.2000 పైనే రేట్లు ఉండగా.. హైదరాబాద్‌లోని సింగిల్ థియేటర్స్‌లో సైతం రూ.250 క‌ల్కి టిక్కెట్స్ ఉండ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

క‌ల్కి చిత్రంపై భారీ అంచ‌నాలు ఉండ‌గా, హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ ఎపిసోడ్, వీఎఫ్ఎక్స్ వర్క్ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే విధంగా ఉన్నాయని అంటున్నారు.చిత్రంలో చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఉండ‌నున్నట్టు స‌మాచారం. ముఖ్యంగా ప్రభాస్-అమితాబ్‌ల పోరాట సన్నివేషాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని.. కమల్ హాసన్ నట విశ్వరూపం మరోమారు కల్కిలో చూపించారని అంటున్నారు.దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమా పై సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సారి ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉండబోతుదని హింట్ కూడా ఇచ్చారు. దీంతో మూవీపై మ‌రింత క్రేజ్ నెల‌కొంది.

Latest News