Kalki 2898 AD| ప్ర‌చారాలు మొద‌లు పెట్ట‌బోతున్న క‌ల్కి టీం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..!

Kalki 2898 AD| పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మక చిత్రాల‌లో ‘క‌ల్కి 2898AD’ చిత్రం ఒక‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ

  • Publish Date - May 15, 2024 / 08:05 AM IST

Kalki 2898 AD| పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మక చిత్రాల‌లో ‘క‌ల్కి 2898AD’ చిత్రం ఒక‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో భారీ క్యాస్టింగ్ కూడా భాగ‌మైంది. చిత్రీకరణ ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 2024 జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్‌కి ఎంతో స‌మ‌యం లేక‌పోవ‌డంతో ప్ర‌చార కార్య‌క్ర‌మాల విష‌యంలో స్పీడ్ పెంచ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌లైన గ్లింప్స్ , పోస్ట‌ర్స్ అంచ‌నాలు భారీగా పెంచాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా త్వ‌ర‌లోనే భారీ ఎత్తున చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు స‌మాచారం. హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నట్టు తెలుస్తుండ‌గా, మే 22న డేట్ ఫిక్స్ చేసిన‌ట్టు ఓ టాక్ న‌డుస్తుంది. అతి త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న అయితే రానుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొనే క‌థానాయిక క‌గా, బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ అశ్వ‌త్థామ పాత్ర‌లో నటిస్తున్నారు. ఇక లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌తినాయ‌కుడిగా, దిశా ప‌టానీ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నుంది.

క‌ల్కి చిత్ర క‌థ మహాభారతకాలంలో మొదలయ్యే ఆరువేల సంవత్సరాల వ్యవధిలో నడుస్తుంది. చిత్రం మైథాలజీ, సైన్స్‌ అంశాల కలబోతగా పాన్‌ వరల్డ్‌ కథాంశం కావడంతో మూవీని అంద‌రికి చేరువ చేసేలా వినూత్న ప్ర‌చారాలు చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ భారీ బ‌డ్జెట్‌తో రూపొందింది కాబ‌ట్టి సినిమాకి భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణలో టికెట్ల రేటుతో పోల్చితే ఏపీలో రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇటీవ‌ల ఎన్నిక‌లు పూర్తి కాగా, జూన్ 4న రిజ‌ల్ట్ రానుంది. ఒక‌వేళ టీడీపీ ప్ర‌భుత్వం వ‌స్తే కల్కి చిత్ర బృందానికి పండ‌గే.ఆ ప్ర‌భుత్వం తిరిగి టిక్కెట్ రేట్స్ పెంచే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Latest News