Kalki 2898 AD| ఇది క‌దా ప్ర‌భాస్ స్టామినా అంటే.. రెండు రోజుల్లో అన్ని కోట్లు వ‌సూలు చేసిందా?

Kalki 2898 AD| మైథ‌లాజిక‌ల్ మూవీ క‌ల్కి చిత్రం జూన్ 27న విడుద‌లై మంచి టాక్‌తో దూసుకుపోతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ

  • Publish Date - June 29, 2024 / 05:30 PM IST

Kalki 2898 AD| మైథ‌లాజిక‌ల్ మూవీ క‌ల్కి చిత్రం జూన్ 27న విడుద‌లై మంచి టాక్‌తో దూసుకుపోతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రలు పోషించారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చిత్రాన్ని అత్యద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాపై సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ ఈ చిత్రం ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచిందంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెకకెక్కిన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేశారు. ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. మొదటి రోజు (గురువారం) రూ. 191.5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు (శుక్రవారం) రూ. 107 కోట్లు వసూలు చేసిన‌ట్టు తెలుస్తుంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 298.5 కోట్లు వసూల్ చేసింది. ఈ మేరకు మూవీ టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. రెండు రోజుల్లో ఈ మూవీ రూ.300 కోట్ల మార్క్ చేరి తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటింది. అయితే, మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు కొంచెం తగ్గాయి అనే చెప్పాలి . వీకెండ్‌లో మరో రెండు రోజులు ఉండటంతో, ఈ చిత్రం మొదటి వారంలోనే భారీ వసూళ్లు రాబ‌ట్టే అవ‌కాశం లేక‌పోలేదు.

ముఖ్య‌మైన ప్రాంతాల వారీగా చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా క‌ల్కి చిత్రం రూ. 298.5 కోట్లు గ్రాస్, రూ.150 కోట్లు షేర్ రాబ‌ట్టింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: రూ.168 కోట్లు, కర్నాటక: రూ.25 కోట్లు,తమిళనాడు: రూ.16 కోట్లు, కేరళ: రూ.6 కోట్లు ,నార్త్: రూ.85 కోట్లు, ఓవర్సీస్: రూ.70 కోట్లు వ‌సూళ్లు సాధించింది. వీకెండ్ పూర్తయ్యేసరికి క‌ల్కి చిత్రం 500 నుంచి 600 కోట్ల వరకు క‌లెక్ష‌న్స్ సాధించే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రు చూడ‌గ‌లిగే చిత్రం కావ‌డంతో రోజు రోజుకి మూవీకి అశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. టిక్కెట్ ధ‌ర‌లు భారీగా ఉన్నా కూడా మూవీని థియేట‌ర్స్‌లో చూడాల‌నే ఉద్దేశంలో ప్రేక్ష‌కులు క్యూ క‌డుతున్నారు. ఈ మూవీకి మ‌రో సినిమా పోటీ లేదు కాబ‌ట్టి రెండు వారాల పాటు క‌లెక్ష‌న్స్ స్థిరంగా కొన‌సాగితే మాత్రం 1000 నుంచి 1500 కోట్ల మధ్యలో కలెక్షన్స్ ని కల్కి మూవీ సాధించే ఛాన్స్ ఉందని చెప్పుకొస్తున్నారు.

Latest News