KALKI 2898 AD| క‌ల్కి 2898 ఏడీ నుండి స‌ర్‌ప్రైజింగ్‌గా సాంగ్ విడుద‌ల.. అదిరిపోయిందిగా..!

KALKI 2898 AD| ప్ర‌భాస్, దీపికా ప‌దుకొణే, క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బచ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి. ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అమెరికాలోనే మొదటిరోజు ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసిందంటే ఈ సినిమా ప్ర‌భంజ‌నం ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుద‌ల కాగా, అంత‌టా కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వ‌స్తుం

  • Publish Date - June 29, 2024 / 02:34 PM IST

KALKI 2898 AD| ప్ర‌భాస్, దీపికా ప‌దుకొణే, క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బచ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి. ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అమెరికాలోనే మొదటిరోజు ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసిందంటే ఈ సినిమా ప్ర‌భంజ‌నం ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుద‌ల కాగా, అంత‌టా కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే తమిళం, మళయాళంలో మాత్రం కాస్త‌ నిరాశపరిచింది. తమిళంలో రూ.4 కోట్లు, మళయాళంలో రూ.2.2 కోట్లను మాత్ర‌మే కల్కి రాబట్టింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ నటించిన కూడా క‌లెక్ష‌న్స్ ఎక్కువ‌గా రాకపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

అయితే సినిమాని జ‌నాల‌లో మ‌రింత‌గా తీసుకెళ్లేందుకు చిత్ర బృందం వినూత్నంగా ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. ఈ క్రమంలో చిత్రం నుండి ట‌క్క ట‌క్క‌ర అంటూ కాంప్లెక్స్‌లో సాగే సాంగ్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది.ప్ర‌పంచంలో ఉన్న వ‌నరులన్నీ కాంప్లెక్స్‌లో ఉండ‌గా, అక్క‌డికి వెళ్లిన భైర‌వ‌( ప్ర‌భాస్), రోక్సీ ( దిశా ప‌టాని) ఆ వింత‌ల‌న్నీ చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతారు. సాంగ్ చాలా ఫ‌న్నీగా సాగ‌గా, తాజాగా ఫుల్ వీడియోని విడుద‌ల చేసారు. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా సాంగ్ దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం ఈ పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ఇక ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలుపుకుని రూ. 370 కోట్లు వ్యాపారం అయింది. 2 రోజుల్లో దాదాపు రూ. 134 కోట్లు షేర్‌తో పాటు రూ. 260 కోట్లు గ్రాస్‌ను క‌ల్కి వసూలు చేసింది. చూస్తుంటే ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో మ్యాజిక్ ఫిగ‌ర్ క్రాస్ చేయ‌నుంద‌ని తెలుస్తుంది. కాగా, మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజు రూ.191.5కోట్లు వసూలు చేసిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది

 

Latest News