Kalki| బుజ్జి గాల్లో ఎగురుతుందా.. క‌ల్కిలో ఈ బుజ్జి కోసమే అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారా..!

Kalki| స‌లార్ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ నుండి వ‌స్తున్న క్రేజీ ప్రాజెక్ట్ క‌ల్కి. ఈ సినిమా కోసం కొన్నాళ్లుగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు . 400 కోట్ల బడ్జెట్ తో వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌పై అశ్వినిద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, ..

  • Publish Date - May 22, 2024 / 09:59 AM IST

Kalki| స‌లార్ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ నుండి వ‌స్తున్న క్రేజీ ప్రాజెక్ట్ క‌ల్కి. ఈ సినిమా కోసం కొన్నాళ్లుగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు . 400 కోట్ల బడ్జెట్ తో వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌పై అశ్వినిద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, .. లాంటి చాలా మంది స్టార్స్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచ‌నున్నారు. నాగ్ అశ్విన తెర‌కెక్కిస్తున్న కల్కి 2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలు చూసి అభిమానులు ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇటీవ‌ల కల్కి సినిమా నుంచి భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) బుజ్జి అని కీర్తి సురేష్ వాయిస్ తో ఓ వీడియో విడుద‌ల చేయ‌డం మ‌నం చూశాం. అందులో బుజ్జి అనేది ప్ర‌భాస్ వాడే వాహ‌నం కాగా, దీనిని చాలా అద్భుతంగా రూపొందించార‌ట‌. కల్కి సినిమా మొదలుపెట్టినప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వ‌యంగా మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్రని కలిసి ఈ సినిమా కోసం స్పెషల్ గా అలాంటి వెహిక‌ల్ ఒక‌టి కావాల‌ని రెడీ చేయించుకున్నాడ‌ట‌. బుజ్జి అనే స్పెషల్ వెహికల్ కోసం నిర్మాత‌లు ఏకంగా 7 కోట్లు ఖర్చు చేసిన‌ట్టు తెలుస్తుంది. బుజ్జిరోల్ సినిమాకి ప్ర‌త్యేకం కానుంద‌ని అంటున్నారు.

సినిమాలో యుద్ధ సన్నివేశాల్లో బుజ్జిని ప్రత్యేకంగా దీన్ని వాడతారని, ఈ వెహికల్ గాల్లోకి కూడా ఎగురుతుంది అని అంటున్నారు. ఇదే కాక సినిమాలలో మ‌రెన్నో స‌ర్‌ప్రై్‌లు కూడా ఉంటాయ‌ని తెలుస్తుంది. ప్రభాస్ కి స్పెషల్ గా రెండు కోట్లు పెట్టి బులెట్స్ పేల్చే జాకెట్ కూడా త‌యారు చేయించారని అంటున్నారు. ఇక మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. మే 22న హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో సాయంత్రం 5 గంటల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించ‌బోతున్నారు. వేడుక‌లో బుజ్జి పాత్ర‌ని ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌నున్నారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటు మూవీ యూనిట్ అంతా వస్తారని సమాచారం.

Latest News