Kalki 2898 AD| సలార్‌తో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ అదే ఉత్సాహంతో చేసిన సినిమా కల్కి. ఈ మూవీ ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి క్లాసిక్ హిట్స్ అందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమాకు రూ.1100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు రాగా, ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే కల్కి సినిమా 35వ రోజుతో రూ. 160.46 కోట్ల లాభాలు రాబట్టింది. దాంతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఏ చిత్రానికి సాధ్యం కాని లాంగ్ రన్‌ని ఈమూవీ కొనసాగిస్తుంది. అయితే ఈ మూవీపై మరింత ఆసక్తి పెంచేందుకు మేకర్స్ దేశ వ్యాప్తంగా ఆగస్టు 2 నుండి 9 వ తేదీ వరకు టికెట్ ధరను 100 రూపాయలకి నిర్ణయించడం జరిగింది.
ఇది అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటి వరకూ చిత్రాన్ని చూడని వారు ఇప్పుడు మూవీని థియేటర్స్‌కి వెళ్లి తప్పక చూస్తారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై నెల రోజులు దాటుతోంది. కొన్ని చోట్ల ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే కల్కి ఓటీటీ విడుదలకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. థియేటర్లలో చూడని వారు, మరోసారి కల్కిని వీక్షించాలని ఆశపడుతున్న వారు ఓటీటీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా, వారు ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే అది కూడా ప్రకటించనున్నారు. ఆగస్టు 23న కల్కి ఓటీటీలోకి రావాల్సి ఉండగా, ఇండిపెండెన్స్ డే సందర్భంగా కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ ఆగస్టు 15వ తేదీ నుంచి జరగనున్నట్టు సమాచారం.
ఇక కల్కి చిత్రంలో బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.