Kalki| ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. క‌ల్కి ట్రైల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

Kalki| డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌ల్కి. జూన్ 27న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్.. తో సినిమాపై ఓ రేంజ్‌లో అంచ‌నాలు పెరిగాయి. వైజయంతి మూవీస్

  • Publish Date - June 5, 2024 / 10:32 AM IST

Kalki| డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌ల్కి. జూన్ 27న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్.. తో సినిమాపై ఓ రేంజ్‌లో అంచ‌నాలు పెరిగాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. కల్కి సినిమాలో అమితాబ్, కాల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. లతో పాటు మరింతమంది స్టార్ నటీనటులు ఉన్నారని సమాచారం. ఇక ఈ మూవీ ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. చిత్రాన్ని జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని డిసైడ్ అయ్యారు.

అయితే ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేయ‌డంతో మూవీ ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచ‌బోతున్నారు. కూటమి గెలవడంతో తాజాగా కల్కి సినిమా ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసారు. కల్కి సినిమా ట్రైలర్ జూన్ 10న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్. మరి దీనికి భారీ ఈవెంట్ చేస్తారా లేదా డైరెక్ట్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారా చూడాలి. అయితే ఢిల్లీ, ముంబైలో ఫిల్మ్‌మేకర్స్ భారీ స్థాయిలో రెండు ఈవెంట్స్ నిర్వహిస్తారని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ కీర్తి సురేష్.. బుజ్జి వెహికల్‌కు వాయిస్ ఓవర్ చెప్పి సినిమాలో భాగమైంది. భైరవగా ప్రభాస్.. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. అయితే కల్కి సినిమా 2 గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించనున్నట్లు స‌మాచారం

కల్కి 2898 ఏడీ సినిమాలో భైరవ పాత్ర చేశారు ప్రభాస్. విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి ఆధారంగా ఈ పాత్ర ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.. భారత పురాణాల ఆధారంగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మూవీ చూస్తే ప్రేక్షకులకు వేరే లోకంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందని తాను నమ్ముతున్నానని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవల చెప్పారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. స‌లార్ వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

Latest News