Actress| నటిని దారుణంగా హ‌త్య చేసిన భ‌ర్త‌.. కార‌ణం ఏంటో తెలుసా?

Actress|  ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో రెండు మ‌ర‌ణాలు ప్రేక్షకుల‌కి ఎంత బాధ‌ని క‌లిగించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌విత్రా జ‌య‌రాం కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించగా, ఆమె మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు చందు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడు. వారి మ‌ర‌ణం ఇండ‌స్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే వీరి మ‌ర‌ణ వా

  • Publish Date - May 22, 2024 / 11:30 AM IST

Actress|  ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో రెండు మ‌ర‌ణాలు ప్రేక్షకుల‌కి ఎంత బాధ‌ని క‌లిగించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌విత్రా జ‌య‌రాం కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించగా, ఆమె మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు చందు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడు. వారి మ‌ర‌ణం ఇండ‌స్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే వీరి మ‌ర‌ణ వార్త‌ని మ‌ర‌చిపోక‌ముందే మ‌రో మ‌ర‌ణ వార్త అంద‌రికి షాకింగ్‌గా మారింది. బ్లాక్‌ బాస్టర్‌ మువీ ‘భజరంగీ’ నటి, కాంగ్రెస్‌ నేత విద్య (36) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. మైసూర్‌లోని తన ఇంట్లో ఆమె భర్త నందీష్ హ‌త్య చేసి ఆ త‌ర్వాత‌ పరార్‌ అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

న‌టి విద్య, నందీష్‌ని 2018లో వివాహం చేసుకోగా, కొన్నాళ్ల‌కి వీరిద్ద‌రి మ‌ధ్య తీవ్ర మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయి. ఏవో కార‌ణాల వ‌ల‌న ఇద్ద‌రు గొడ‌వ‌ప‌డుతూ ఉండేవారు. ఓసారి నందీష్ వీడాకుల కోసం కూడా ప్ర‌య‌త్నించ‌గా, పెద్ద‌లు రాజీ కుదిర్చారు. అయిన వారి మ‌ధ్య గొడ‌వ‌లు స‌ర్ధుకోలేదు. ఈ క్ర‌మంలోనే విద్య మైసూరులోని తుర్గనూర్‌లో ఉన్న తన భర్త ఇంటి నుంచి నుంచి బెంగళూరులోని తన స్వగ్రామమైన శ్రీరాంపూర్‌కు వచ్చింది. అయితే మే 20న నందీష్‌,విద్య మ‌ధ్య ఫోన్‌లో గొడ‌వ జ‌ర‌గ‌గా, ఆ రోజు రాత్రి శ్రీరాంపూర్ నుంచి బయలుదేరి మైసూర్‌లోని తుర్గనూర్ కి వ‌చ్చి భ‌ర్త‌తో గొడ‌వ‌కు దిగింది. ఇద్ద‌రి మ‌ధ్య మాటమాట పెర‌గ‌డంతో నందీష్ ఆమెపై సుత్తితో దాడి చేయ‌గా, ఆమె అక్క‌డికక్క‌డ క‌న్నుమూసింది.

హ‌త్య చేశాక నందీష్ అక్క‌డి నుండి ప‌రార‌య్యాడు. ఈ విష‌యం తెలుసుకున్న బన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులు, బంధువుల నుంచి అవసరమైన సమాచారం సేకరించి నందీష్‌పై కేసు న‌మోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు నందీష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, శాండల్‌వుడ్‌లో జూనియర్ ఆర్టిస్ట్ అయిన విద్య ‘భజరంగీ’, ‘వజ్రకాయ’, ‘వేద’, ‘జై మారుతి 800’, ‘అజిత్‌’ వంటి ఎన్నో సూప‌ర్ హిట్ మూవీస్ లో స‌హాయ న‌టిగా న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. రాజ‌కీయాల‌లోను ఆమె చాలా యాక్టివ్‌గా ఉండేది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన త‌ర్వాత ఆమె మైసూర్ సిటీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా వ్యవహరించారు.

Latest News