విధాత: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట తల్లిదండ్రులయ్యారు. శుక్రవారం కత్రినా కైఫ్ మగబిడ్డకు జన్మనిచ్చారు. తన పుత్రోత్సహాన్ని విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ పోస్ట్ పెట్టారు. ‘ఎంతో ఆనందంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ విక్కీ ఈ శుభవార్తను పంచుకున్నారు.
ఈ పోస్టుపై స్పందిస్తూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొన్నేళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ 2021లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.
