Site icon vidhaatha

Mallika Rajput | సినీ పరిశ్రమలో విషాదం.. సింగర్‌ మల్లికా రాజ్‌పుత్‌ ఆత్మహత్య..!

Mallika Rajput | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. యూపీకి చెందిన నటి, సింగర్‌ విజయలక్ష్మి అలియాస్‌ మల్లికా రాజ్‌పుత్‌ (35) తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధి సీతాకుండ్‌లోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబం నిద్రలో ఉన్న సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.


అయితే, ఘటనపై మల్లికా రాజ్‌పుత్‌ తల్లి సుమిత్రా మాట్లాడుతూ ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియదని.. తాను తన గదిలో పడుకున్నానని.. చాలాసేపటి వరకు గదిలో లైట్‌ వెలుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి తలుపు తట్టాని తెలిపింది. తలుపులు ఎంతకీ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని.. వెంటనే తన భర్తను పిలిచి.. పక్కింటి వారితో కలిసి తలుపులు బద్దలు కొట్టి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది.


ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అప్పటికీ మృతి చెందిందినట్లు తెలిపారంటూ కన్నీటి పర్యంతమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మల్లికా సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అదే సమయంలో నటిగా పని చేస్తున్నది. తనగాత్రంలో సినీ ప్రియులను అలరించింది. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ప్రేమ వ్యవహారమా? లేదంటే వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version