విధాత : తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకే ప్రారంభమైనప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాతే కనిపిస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీంతో సాయంత్రం వేళ చంద్రోదయం సమయంలో గ్రహణ చంద్రుడిని చూసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపారు. ఎరుపు రంగులో కనువిందు చేస్తున్న చంద్రుడి(బ్లడ్ మూన్) వీక్షణ ప్రత్యేక అనుభూతిని కల్పిస్తుంది. కొందరు నేరుగా…మరికొందరు బైనాక్యూలర్స్ సహాయంతో చంద్ర గ్రహణ దృశ్యాలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు.
చంద్రగ్రహణం ముగిసే చివరి ఘట్టం సాయంత్రం 6:47వరకు గ్రహణ చంద్రుడిని వీక్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మనీలా, పిలిప్పీన్స్ దేశాలలో అం తటా సంపూర్ణ చంద్ర గ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా పూర్తి బ్లడ్ మూన్ రూపంలో కనిపిస్తాడని ఖగోళ వేత్తలు వెల్లడించారు.
