Ancient Vishnu statue| వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!

ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి కాటారం మండలం చింతకాని గ్రామం చివరి అడవి ప్రాంతంలో వాగులో 1000 సంవత్సరాల నాటి పురాతన విష్ణు మూర్తి విగ్రహం బయటపడటం సంచలనంగా మారింది.

విధాత : ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి కాటారం మండలం చింతకాని గ్రామం చివరి అడవి ప్రాంతంలో వాగులో 1000 సంవత్సరాల నాటి పురాతన విష్ణు మూర్తి విగ్రహం బయటపడటం సంచలనంగా మారింది. కృష్ణ / గోవింద / చెన్న కేశవ / విష్ణు మూర్తి విగ్రహంగా దీనిని భావిస్తున్నారు. 12-13వ శతాబ్ధానికి చెందిన ఈ విగ్రహం చుట్టు దశావతారాలు కూడా అత్యంత సుందరంగా చెక్కారు. అద్బుత శిల్పకళలో కనిపిస్తున్న ఈ విగ్రహం గత కొంత కాలంగా వాగులోనే పడిఉండగా..తాజాగా కొంతమంది స్థానిక యువకులు దానిని బయటకు తీశారు.

కాకతీయుల కాలంలో ఒక వెలుగు వెలిగిన 1000 ఏళ్ల క్రితం నాటి పాంచాలరాయ దేవాలయంలో ఉన్న కృష్ణుడి విగ్రహానికి..వాగులో లభించిన విగ్రహానికి చాలా దగ్గరి పోలికలు ఉండటం ఆసక్తికరంగా మారింది. వాగులో కొంతమేరకు విగ్రహం కనిపించడంతో గ్రామస్తులు జెసిపి సహాయంతో బయటకు తీశారు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి విష్ణుమూర్తి విగ్రహానికి పూజలు చేశారు.

 

Latest News