రైతు భరోసా రెండో విడత ఎల్లుండే..
ఈనెల 20న కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. 1-5 ఎకరాల రైతులైన 45.11 లక్షల మందికి రూ.5,653 కోట్లు జమ కానున్నాయి.
విధాత: రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 20న భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో 1నుంచి 5 ఎకరాల్లోపు భూమి ఉన్న 45.11 లక్షల మంది రైతులకు రూపాయలురూ .5.653 కోట్లు జమ చేయనున్నారు. ఇప్పటికే గత నెల 23న తొలి విడత కింద ఎకరం వరకు ఉన్న 68 లక్షల మంది రైతులకు ఖాతాల్లోకి రూ.3590కోట్లు జమ చేసిన సంగతి తెలిసింది. యాసంగి రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈ దఫా మూడు విడుదలగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. మూడో విడత నిధులను సైతం ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
కేంద్ర ఉద్యోగులకు డీఏ 2% పెంపు.. 60%కు చేరిన భత్యం, జనవరి నుంచే అమలు
మోమోస్ ఎఫెక్ట్… మెమోరీలాస్.. లివర్ ఫెయిల్యూర్.. కనీసం నిలబడలేకపోయిన పదేళ్ల చిన్నారి…
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram