Site icon vidhaatha

Keerthy Bhat|ప్రైవేట్ పార్ట్స్‌ని ట‌చ్ చేసే వారు..వ‌స్తావా అని అడిగితే స‌రే అన్నా: కీర్తి భ‌ట్

Keerthy Bhat| ఇటీవ‌ల చాలా మంది భామ‌లు త‌మ జీవితంలో ఎదురైన విచిత్ర ప‌రిస్థితుల గురించి ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో తాము ఎన్ని క‌ష్టాలు ప‌డ్డామ‌ని చెప్పేందుకు వెన‌కాడ‌డం లేదు. తాజాగా సీరియ‌ల్ న‌టి, బిగ్ బ్యూటీ కీర్తి భ‌ట్ షాకింగ్ కామెంట్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. కీర్తి భ‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచిత‌మే. 2019లో మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ భామ ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్లో హిమ పాత్ర పోషించి మరింత ద‌గ్గ‌రైంది. ఇక బిగ్ బాస్ షోలో ఆఫ‌ర్ రావ‌డంతో హౌజ్‌లోకి అడుగుపెట్టి అద‌ర‌గొట్టింది. టాప్‌5లో నిలిచి త‌న స‌త్తా చూపించింది. ప్ర‌స్తుతం కీర్తి భ‌ట్.. మధురానగరిలో సీరియల్లో నటిస్తుంది.

ఎప్పుడు న‌వ్వుతూ క‌నిపిస్తూ ఉండే కీర్తి భ‌ట్ జీవితంలో ఎన్నో కష్టాలు.. చేదు రోజులు ఉన్నాయి. అవి అప్పుడ‌ప్పుడు ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెబుతూ కంట క‌న్నీరు పెట్టిస్తుంటుంది. కీర్తి భ‌ట్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసింది. కారు ప్రమాదంలో కీర్తి భట్ తన తల్లిదండ్రులతోపాటు అన్నయ్య, వదినలను కోల్పోయింది. ఈ విష‌యాన్ని బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు కూడా చెప్పింది. అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత త‌న‌ని మంగుళూరుకి తీసుకెళ్లి అక్క‌డ 35 రోజుల పాటు చికిత్స అందించార‌ట‌. అయితే ఆ స‌మ‌యంలో త‌న‌కి ఎన్నో చేదు అనుభ‌వాలు ఎదురైన‌ట్టు పేర్కొంది. వారు ప్రైవేట్ పార్ట్స్‌పై ట‌చ్ చేసే వార‌ని, నాకు స్ప‌ర్శ లేక‌పోవ‌డం వ‌ల‌న వారిని ప‌క్క‌కు నెట్టేసే బ‌లం కూడా ఉండేది కాద‌ని తెలియ‌జేసింది.

ఇక కొంత‌ కోలుకున్న తర్వాత అక్కడి నుంచి చెప్పకుండా వచ్చేశాను. అయితే ఎటైన‌ వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్తే 200 ఇస్తా వస్తావా అంటే పాకు అందులో అర్ధం తెలియ‌క‌ సరే వస్తానని అనేదాన్ని. ఆ తర్వాత వాళ్ల లుక్స్ చూసి అస‌లు విష‌యం అర్ధ‌మైంది అంటూ కీర్తి భ‌ట్ త‌న జీవితంలో ఎదురైన క‌ష్టాల గురించి చెప్పుకొచ్చింది. కీర్తి భట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.ఇక ఇటీవ‌ల కీర్తి కన్నడ పరిశ్రమకు చెందిన విజయ్ కార్తీక్ తో నిశ్చితార్థం జ‌రుపుకుంది. అత‌ను 2014లో కన్నడలో మెలోడీ అనే సినిమాతో హీరోకి స్నేహితుడిగా పరిచయమయ్యాడు .. ఆ తర్వాత సేడు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. త్వ‌ర‌లో ఈ ఇద్ద‌రు పెళ్లి కూడా చేసుకోనున్న‌ట్టు తెలుస్తుంది.

Exit mobile version