Keerthy Suresh| ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లీడు వయస్సు రావడంతో తమకి నచ్చిన వారిని మనువాడుతున్నారు. కొందరు తమ ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇస్తున్నా ఇంకొందరు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్స్ వారి పర్సనల్ విషయాల గురించి అనేక ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా కీర్తి సురేష్ తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్‌తో ఏడడుగులు వేయనుందంటూ అనేక ప్రచారాలు సాగాయి. వీరిద్దరు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారాలపై కీర్తి తాజాగా స్పందించింది.
సోషల్ మీడియాలో నా గురించి వైరల్ అవుతున్న రూమర్స్‌పై క్లారిటీ ఇస్తే అవి నిజమనే నమ్ముతారు. అందుకే అలాంటి రూమర్స్‌పై నేను స్పందించనంటూ కీర్తి చెప్పుకొచ్చింది. కేవలం నా సినిమాల ఎంపిక.. నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తాను. ఇక నా వ్యక్తిగత జీవితం.. ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా కూడా నేను ఏ మాత్రం పట్టించుకోను.. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ తన పెళ్లి వార్తలను కొట్టిపారేసింది కీర్తి సురేశ్. ప్రస్తుతం తన దృష్టాంతా కూడా సినిమాలపైనే ఉందని, పెళ్లి చేసుకుంటే మాత్రం అందరికి చెప్పి చేసుకుంటానంటూ కీర్తి కామెంట్ చేసింది.
భోళా శంకర్ తర్వాత తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన కీర్తిసురేష్ ఇటీవలే ఓ కామెడీ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉప్పు కప్పురంబు పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సుహాస్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీని అనౌన్స్ చేశారు. తెలుగులో రూపొందుతోన్న ఈ మూవీని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది చివరలో ఉప్పుకప్పురంబు మూవీని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో మూడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది.వీటిలో రఘుతాత మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది.