Anasuya| మొన్న జాకెట్ విప్పింది, ఇప్పుడు స్టూడెంట్స్‌తో రొమాన్స్‌.. అన‌సూయ‌పై తెగ ట్రోలింగ్

Anasuya| అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ భామ ప‌లు షోల‌తో మంచి పేరు తెచ్చుకోవ‌డంతో పాటు సినిమాల‌లో

  • Publish Date - July 5, 2024 / 10:50 AM IST

Anasuya| అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ భామ ప‌లు షోల‌తో మంచి పేరు తెచ్చుకోవ‌డంతో పాటు సినిమాల‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ మ‌ధ్య సినిమా అవ‌కాశాలు కాస్త స‌న్న‌గిల్ల‌డంతో తిరిగి బుల్లితెర‌పై సంద‌డి చేస్తుంది. ఎప్ప‌టి మాదిరిగానే త‌న అంద‌చందాల‌తో అద‌ర‌గొడుతూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షో చేస్తున్న అన‌సూయ లాంచింగ్ ఎపిసోడ్ లో అనసూయ శేఖర్ మాస్టర్ తో కలసి జాకెట్ విప్పేసి తెగ ర‌చ్చ చేసింది.

అన‌సూయ తీరుపై నెటిజ‌న్స్ మండిప‌డ్డారు. అయిన కూడా ఈ భామ వాటిని లైట్ తీసుకుంది. ఇక తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో అనసూయ, శేఖర్ మాస్టర్ లెక్చరర్స్ అవతారం ఎత్తారు. మిగిలిన వాళ్లంతా స్టూడెంట్స్ మాదిరిగా నానా హంగామా చేశారు. అయితే అన‌సూయ లాంటి అంద‌మైన లెక్చ‌ర‌ర్ స్టూడెంట్ క‌ళ్ల ముందు ఉండ‌డంతో వారు చేసిన చిలిపి కామెంట్స్ అంతా ఇంతా కాదు. ఓ స్టూడెంట్ అయితే ఏకంగా రెడ్డు శారీతో పాటు మీరు కూడా అదిరిపోయారు అని అన‌డంతో అనసూయ సిగ్గు పడుతూ కనిపిస్తోంది.

మ‌రో స్టూడెంట్ అయితే బెండకాయ, దొండ కాయ.. అనసూయ మేడం నా గుండెకాయ అని ఆమెని ఆకాశానికి ఎత్తారు. ఇక శ్రీముఖి మ‌ధ్య‌లో జాకెట్ విష‌యం గురించి మరోసారి ప్ర‌స్తావన తీసుకొచ్చి చీప్ పబ్లిసిటీ చేస్తుందంటూ కొంద‌రు నెటిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ప్రోమోలో అర్జున్ అంబటి, ప్రియాంక, విష్ణుప్రియ, రీతూ చౌదరితో పాటు మ‌రి కొంత‌మంది బుల్లితెర ఆర్టిస్ట్‌లు నానా హంగామా చేశారు. అర్జున్ అంబటి అయితే ప్రియాంకని నడుము పట్టుకుని పైకెత్తుకోవ‌డం ప్రోమోలో హైలైట్‌గా మారింది.. ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండ‌గా, దీనిపై నెటిజ‌న్స్ ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

Latest News