Site icon vidhaatha

Kovai sarala| అల్లు అర్జున్‌ని పెళ్లి చేసుకోవాల‌ని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కోవై స‌ర‌ళ‌

Kovai sarala|  కోవై స‌ర‌ళ‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో తెలుగు సినిమాల‌లో త‌న‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించింది. అద్భుతమైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించ గల కోవై స‌ర‌ళ వ‌య‌స్సు ఇప్పుడు 62 ఏళ్లు. అయిన ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. సింగిల్‌గ‌నే ఉంటూ సినిమాలు చేసుకుంటూ త‌న జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. రీసెంట్‌గా అలీతో స‌ర‌ద‌గా కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది కోవై స‌ర‌ళ‌. అక్క‌డ ఆలీ చూస్తూ తెగ సంబ‌ర‌ప‌డిపోయింది. ఇక తెగ పంచ్‌లు వేస్తూ న‌వ్వించింది. ఇక అలీ ఇప్పటి వరకు నీవు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడ‌గ‌గా, దానికి స్పందిస్తూ పెళ్లి అనేది త‌న‌కు ఇష్టం లేదని.. అయినా పెళ్లి చేసుకుంటేనే జీవించాలి ఏమైనా రూల్ ఉందా ఉంటూ ఎదురు ప్ర‌శ్నించింది.

నువ్వు ఎవరిని ప్రేమించ‌లేదా అని ఆలీ అడ‌గ‌గా, ఓసారి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పానని తెలిపింది. ఎవరని అడగ్గానే.. నీకే చెప్పానుగా.. ఇప్పటికీ నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదంటూ సరదాగా చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల‌లో ఎవ‌రిని పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటావు అని ఆలీ అడ‌గ్గా, మరోమాట ఆలోచించ‌కేండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆ తర్వాత తనకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే చాలా ఇష్టం అని , దేశ‌ముదురు సినిమాలో మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చి త‌న‌కు విప‌రీత‌మైన పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌చ్చేలా చేశాడ‌ని పేర్కొంది. ఇక త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన కొన్ని సంగ‌తుల‌ని కూడా షేర్ చేసుకుంది.

ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్ కట్‌లో కోవై అని పిలిచేవారని, అలా త‌న ఊరు పేరుతో కోవై స‌ర‌ళ‌గా మారాన‌ని పేర్కొంది. 1962లో ఏప్రిల్ 7వ తేదీన జన్మించిన కోవై సరళకు నలుగురు సోదరులు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా కోయంబత్తూరులోనే సెటిల్ అయ్యారు. అయితే కోవై స‌ర‌ళ సినిమా షూటింగ్స్ వ‌ల‌న ప‌లు ప్రాంతాల‌కి వెళ్లాల్సి వ‌స్తుంటుంది. తాను చాలా ఫన్నీగా ఉంటానని, కాక‌పోతే ఇప్పుడే కాస్త ఆర్టిఫిషీయల్‌గా, పద్దతిగా ఉంటున్నానని తెలిపింది. సినిమాల కోసం ఆ బాడీ లాంగ్వేజ్‌ను తెచ్చుకోలేదని కూడా కోవై స‌ర‌ళ తెలియ‌జేసింది.

Exit mobile version