Site icon vidhaatha

Prabhas| ఏంటి.. క‌న్న‌ప్ప ప్రాజెక్ట్ ప్ర‌భాస్ చేయాల్సిందా.. మరి మంచు విష్ణు ద‌గ్గ‌రకు వెళ్లింది..!

Prabhas| ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్స్‌లో క‌న్న‌ప్ప చిత్రం ఒక‌టి.ఇందులో మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, ఈ మూవీని వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే జూన్ 14న మూవీ నుండి నిమిషానికి పైగా ఉన్న టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో యాక్ష‌న్ ఎపిసోడ్స్, లొకేష‌న్స్, గెట‌ప్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక మూవీలో మంచు విష్ణు తిన్న‌డు అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌లో ప్రత్యేక పాత్రలు చేస్తున్న మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ లను పాక్షికంగా పరిచయం చేశారు. అక్షయ్ కుమార్ ని శివుడిగా చూపించారు. ప్రభాస్ ..ముఖాన అడ్డ నామాలతో గూస్ బంప్స్ తెప్పించేలా క‌నిపిస్తున్నాడు. నందీశ్వ‌రుడు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

మైథలాజికల్‌ అంశాలతో మంచు విష్ణు `కన్నప్ప` సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీకి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మోహ‌న్ బాబు ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనేక విష‌యాలు వెల్ల‌డించారు. `కన్నప్ప` సినిమాని గతంలో కృష్ణంరాజు చేశారు. `భక్త కన్నప్ప` పేరుతో ఈ మూవీ సూప‌ర్ హిట్ అయింది. అయితే భ‌క్త కన్న‌ప్ప ఓపెన్ స్టోరీ కాగా, దానిని అంద‌రు తీసే అవ‌కాశం లేదు. అందుకు కార‌ణం సినిమా ప‌ర‌మైన హ‌క్కులు ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణ వద్ద ఉన్నాయి. `భక్త కన్నప్ప`ని ఆయనే నిర్మించారు. అయితే మోహ‌న్ బాబు భ‌క్త క‌న్న‌ప్ప చేయాల‌ని భావించి కృష్ణంరాజుని సంప్ర‌దించ‌గా, ఆ స‌మ‌యంలో మ‌రో మాట మాట్లాడ‌కుండా రైట్స్ ఇచ్చాడ‌ట‌.

తన వద్ద ఉన్న కంటెంట్‌ కూడా ఇస్తానని మొత్తం ఇచ్చేశాడట. అయితే ఈ మూవీని తాను ప్రభాస్‌తో చేయాలనుకున్నాను, దానికోసమే వెయిట్‌ చేస్తున్నానని కృష్ణంరాజు అన్నాడ‌ట‌. దాంతో మోహ‌న్ బాబు వెన‌క్కి త‌గ్గాల‌ని అనుకోగా,అప్పుడు కృష్ణంరాజు.. మంచు విష్ణు కూడా నాకు మ‌రో కొడుకు లాంటి వాడు. అత‌ని కోసం ఇచ్చేస్తాన‌ని కృష్ణంరాజు తెలిపాడ‌ట‌. అలా మంచు విష్ణుతో ఈ మూవీ సెట్ అయింద‌ని మోహ‌న్ బాబు వెల్ల‌డించారు. టీజ‌ర్ లాంచింగ్ ఈవెంట్‌లో కృష్ణంరాజు గొప్ప‌త‌నం గురించి చెప్పుకొచ్చాడు మోహ‌న్ బాబు. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్లు ప్రతి సోమవారం వస్తుంటాయని తెలిపారు మంచు విష్ణు. ఇక ప్ర‌భాస్ పాత్ర గురించి చెప్పుకొచ్చిన విష్ణు.. మరో రెండు నెలల్లో ఆయన లుక్‌, పాత్ర డిటెయిల్స్ తో అప్‌డేట్ ఇస్తాం. ఆయ‌న సినిమా మొత్తంలో క‌నిపిస్తారని అన్నారు.

Exit mobile version