Site icon vidhaatha

Raj Tharun| రాజ్ త‌రుణ్ కేసులో బ‌య‌ట‌కు వ‌చ్చిన సంచ‌ల‌న విష‌యాలు.. 11ఏళ్ల కాపురం, రెండు సార్లు అబార్షన్‌

Raj Tharun| యువ హీరో రాజ్ త‌రుణ్ కెరీర్ విష‌యంలో స‌త‌మ‌తం అవుతుంటే ఇప్పుడు ఆయ‌న‌కి మ‌రో త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది.లావ‌ణ్య అనే యువ‌తి రాజ్ తరుణ్‌పై అనే అభియోగాలు చేస్తూ నార్సింగ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసందే. మ‌రోవైపు లావ‌ణ్య డ్ర‌గ్స్ తీసుకుంటుంద‌ని, మస్తాన్‌ సాయితో ఆమె ఎలాంటి రిలేషన్‌ పెట్టుకుందో అని, ఫోన్‌లో ఎలాంటి బూతులు మాట్లాడిందోనంటూ రాజ్ త‌రుణ్ ఆడియో రికార్డ్ విడుద‌ల చేశారు. ఇక తాజాగా లావణ్య లాయర్‌ కళ్యాణ్‌ దిలీప్‌ సుంకర కేసుకి సంబంధించిన సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు.రాజ్‌ తరుణ్‌, లావణ్య పెళ్లి చేసుకొని 11 ఏళ్ల పాటు కాపురం కూడా చేశారంటూ ఆయ‌న తెలియ‌జేశాడు.

ఇక సంసార బంధంలో ఆమెకి రెండు సార్లు క‌డుపు చేయ‌గా, ఒక‌సారి మిస్ క్యారీ అయింద‌ని, మ‌రోసారి అబార్ష‌న్ చేశాడ‌ని లాయ‌ర్ చెప్పుకొచ్చారు. సుమారు 700 ఆధారాలను కోర్ట్ కి అందించామ‌ని, ఆధారాలను వెరిఫై చేసుకున్న త‌ర్వాత రాజ్‌తరుణ్‌పై కేసు ఫైల్‌ చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఆయనపై 420, 493, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు అయిన‌ట్టు తెలియ‌జేశారు. అయితే లావణ్యకి రెండు సార్లు అబార్షన్‌ కావడం వల్ల గర్భాశయం కూడా దెబ్బతిన్నదని, భవిష్యత్‌లో పిల్లలు పుడతారో, పుట్టరో కూడా తెలియని దారుణ పరిస్థితిలో లావణ్య ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే ఇప్ప‌టికీ లావ‌ణ్య‌.. రాజ్‌త‌రుణ్‌నే కోరుకుంటుంద‌ని, ఆమె ఉద్దేశం రాజ్ త‌రుణ్‌పై కేసు పెట్టాల‌నేది కాద‌ని, మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి గతంలో తనని జైలుకు పంపించిందని, మళ్లీ ఇప్పుడు త‌న అంతు చూస్తాన‌ని బెదిరించ‌డంతో ర‌క్ష‌ణ కోసం పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి లావ‌ణ్య కంప్లైంట్ ఇచ్చిన‌ట్టు దీలీప్ సుంక‌ర తెలియ‌జేశాడు.

కేసులో మాల్వీ ఎవరు అని పోలీసులు విచారిస్తే రాజ్‌ తరుణ్‌ డొంక కదిలిందని చెప్పాడు లాయర్‌. అంతేకాని రాజ్‌ తరుణ్‌ని బెదిరించాలని, బ్లాక్‌ మెయిల్‌ చేయాలని లావణ్య ఉద్దేశ్యం కాదంటూ కూడా ఆయన క్లియ‌ర్ క‌ట్‌గా తెలియ‌జేశాడు. మ‌రోవైపు రాజ్ త‌రుణ్‌.. లావ‌ణ్య‌ని ఎంత హింసించాడో ఫోటోలు చూపించాడు. అలాగే ఫోన్‌లో అబార్షన్ ఫొటోలు చూపించాడు. ఇక కొంత కాలంగా లావ‌ణ్య‌కి రాజ్ త‌రుణ్ దూరంగా ఉండ‌డ‌మే కాక, అపార్ట్‌మెంట్ ఆమెకే ఇచ్చేస్తాన‌ని కూడా అన్నాడ‌ట‌. అయితే లావ‌ణ్య‌కి రాజ్ త‌రుణ్‌పై క‌క్ష్య సాధించే ఉద్దేశం లేద‌ని, తనకు రాజ్‌ తరుణ్‌ కావాలని లావ‌ణ్య అంటుంద‌ని లాయ‌ర్ స్ప‌ష్టం చేశాడు. రానున్న రోజుల‌లో అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. రాజ్ త‌రుణ్ ఎలాంటి వాడో తెలియ‌జేస్తాం అని దిలీప్ స్ప‌ష్టం చేశాడు.

Exit mobile version