Site icon vidhaatha

Raj Tarun| రాజ్ త‌రుణ్‌- లావ‌ణ్య మేట‌ర్‌లో మ‌రో ట్విస్ట్..వారికి మూడేళ్ల కూతురు ఉందా?

Raj Tarun| గ‌త కొద్ది రోజులుగా లావ‌ణ్య‌- రాజ్ త‌రుణ్‌ల మేట‌ర్ నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని కొద్ది రోజుల క్రితం లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డం మ‌నం చూశాం. ఇక త‌ర్వాత తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే అబార్షన్ చేయించాడని , హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఎంటరయ్యాకే రాజ్‌తో తనకు దూరం పెరిగిందని ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది లావ‌ణ్య‌. అంతేకాదు త‌న ద‌గ్గ‌ర ఉన్న మెడికల్ రిపోర్ట్స్, దాదాపు 170కి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

లావ‌ణ్య‌.. రాజ్ త‌రుణ్‌పై ఎన్ని ఆరోప‌ణ‌లు చేసిన ఆయ‌న ఈ మ‌ధ్య పెద్ద‌గా స్పందించ‌డం లేదు. లీగ‌ల్‌గానే ప్రొసీడ్ అవుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా లావ‌ణ్య చేసిన ఆరోప‌ణ‌లకి మాల్వీ మ‌ల్హోత్రా ఆమెపై పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తన కో స్టార్ మాత్రమేనని, ఆయనతో ఆరు నెలలుగా మాట్లాడింది లేదంటూ మాల్వీ చెప్పుకొచ్చింది. రాజ్‌తో కలిసి నటించిన హీరోయిన్లకు లావణ్య ఇలా ఫోన్లు చేసి వేధిస్తోందని ఆమె ఆరోపించింది. అయితే ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ – మాల్వీ చాట్ లీక్ కాగా, ఇందులో రాజ్ తరుణ్ నుండి వచ్చిన ప్రపోజల్ కు మాల్వి మల్హోత్రా వెంటనే యాక్సెప్ట్ అంటూ మెసేజ్ పెట్టింది. అనేక సార్లు రాజ్ తరుణ్ కు మాల్వి హోటల్స్ బుక్ చేసింది. ప్రతీసారి కోయంబత్తూర్ మాధవ హోటల్ లో రాజ్ తరుణ్, మాల్వి కలిసినట్లు తెలుస్తోంది.

ఇక ఇదిలా ఉంటే రాజ్ త‌రుణ్‌-లావ‌ణ్య‌ల‌కి మూడేళ్ల పాప ఉందంటూ ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే వారి కి పాప ఉంటే కూతురిని లావ‌ణ్య ఎక్క‌డ దాచింది అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్స్. ఈ క్ర‌మంలో సీనియర్ జర్నలిస్టు, సినీ క్రిటిక్ అయినటువంటి దాసరి విజ్ఞాన్ క్లారిటీ ఇచ్చారు.లావ‌ణ్య ప్లాన్ ప్ర‌కారం ఇలా చేస్తుంది, ముందుగానే ఒక్కో విష‌యాన్ని ఒక్కో స‌మ‌యంలో బ‌య‌ట‌పెట్టాల‌ని ప్లాన్ ప్ర‌కారం వ‌చ్చింది.

ని యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగారు. ఇందులో భాగంగా లావణ్య గురించి రాజ్ తరుణ్ గురించి ఎన్నో విషయాలు దాసరి విజ్ఞాన్ చెప్పారు. లావణ్య ప్లాన్ చేసి మరీ ఇదంతా చేస్తుందని, ఆమె ముందుగానే ఒక్కొక్క విషయాన్ని ఒక్కో సమయంలో బయట పెట్టాలి అని అంతా ప్లాన్ అయ్యి వచ్చింది. అయిన లావణ్య మస్తాన్ రాజ్ వంటి వారితో తిర‌గంగా లేనిది రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో తిరిగితే ఏమవుతుంది.అది ఆయన ఇష్టం.అలాగే లావణ్య కి రెండు సార్లు ప్రెగ్నెన్సీ పోవడమే కాదు.రాజ్ తరుణ్ వల్ల ఆమెకి ఒక మూడు సంవత్సరాల పాప కూడా పుట్టినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్.

Exit mobile version