Site icon vidhaatha

Raj Tarun|హీరోయిన్‌తో ప్రైవేట్‌గా రాజ్ త‌రుణ్ ముద్దు ముచ్చ‌ట్లు.. బ‌య‌ట‌పెట్టిన లావ‌ణ్య‌

Raj Tarun| గ‌త కొద్ది రోజులుగా రాజ్ త‌రుణ్‌, లావ‌ణ్య‌ల వ్య‌వ‌హారం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. లావ‌ణ్య‌.. రాజ్ త‌రుణ్‌పై అనేక విమర్శ‌లు చేస్తుండ‌గా, రాజ్ త‌రుణ్ మాత్రం సైలెంట్‌గా ఉంటూ వ‌చ్చాడు.ఇటీవ‌ల మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా రాజ్ త‌రుణ్ మీడియా ముందుకు వ‌చ్చి తన వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని, తాను ఏ తప్పు చేయలేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ కేసులో మ‌రో ఆసక్తిక‌ర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తన భర్త అని.. రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు అంటూ లావణ్య మీడియాలో రచ్చ చేస్తుండ‌డంతో రాజ్ తరుణ్ హైకోర్టుని ఆశ్రయించాడు.

ఇక పోలీసులు రాజ్ త‌రుణ్‌ని విచారణకు పిలవడంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనితో పిటిషన్ ని హైకోర్టు విచారణ చేపట్టింది. కేసు గురించి పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు నార్సింగ్ పోలీసులని ఆదేశించ‌డంతో కేసుని వాయిదా వేశారు. అయితే లావ‌ణ్య మ‌రోవైపు రాజ్ త‌రుణ్‌పై ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉంది. రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రైవేట్ గా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒక‌టి లావ‌ణ్‌య బయట పెట్టింది. ఆమె ఎవరు అని మీడియా అడగగా.. ఎవరో తెలియదు.. మీరే చూడండి అంటూ ఫొటో చూపించ‌గా, ఇందులో ఇద్ద‌రు చాలా ఘాడంగా ముద్దులు ఇచ్చుకుంటున్నారు. అయితే ఆమె ఆమె ఇద్దరిలోకం ఒకటే అనే చిత్రంలో నటించింది అని పేర్కొంది లావ‌ణ్య‌.

ఇక‌ తనపై రాజ్ తరుణ్ తరుపున వాళ్ళు డ్రగ్స్ ఆరోపణలు చేస్తుండడంతో లావణ్య కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అవ‌న్నీ కూడా త‌ప్ప‌క బ‌య‌ట‌పెడ‌తానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో డిబేట్‌కు లావణ్య, శేఖర్ భాషా వచ్చారు. వారిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒకానొక స‌మ‌యంలో లావణ్యపై ఆరోపణలు చేస్తూ చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నదని శేఖ‌ర్ భాషా పేర్కొన్నారు. దాంతో కోపంతో ఊగిన లావ‌ణ్య ఆమె చేతులోకి చెప్పు తీసుకొని లైవ్‌లోనే ఆర్జే శేఖర్ భాషాను ముఖంపై కొట్టింది. లావణ్య దాడి ఘటనతో బిత్తరపోయిన ప‌క్క‌న వ్య‌క్తి వారిని ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Exit mobile version