Lavanya Tripathi| అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన భామ లావణ్య త్రిపాఠి. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకులని ఆనందింపజేసింది. ఎక్కువగా యంగ్ హీరోలతో కలిసి పని చేసిన లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్‌తో కలిసి మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ళు సీక్రెట్ గా డేటింగ్ చేసిన వీరు ఎక్కడ కూడా మేటర్ బయటపడకుండా రిలేషన్ కొనసాగించారు. అయితే ఓ రోజు సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ జరుపుకొని పెద్ద షాక్ ఇచ్చారు. ఇక గత ఏడాది నవంబర్ లో ఇటలీలో లావణ్య – వరుణ్ తేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత లావణ్య సినిమాలలో పెద్దగా కనిపించింది లేదు. వరుణ్ తేజ్ మాత్రం వరస పెట్టి సినిమాలు చేస్తున్నా కూడా పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.వారికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత వరుణ్ తేజ్ దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అయితే తిరుమలకి వెళ్లినప్పుడు లావణ్య త్రిపాఠి సంప్రదాయంగా పట్టు బట్టలో మెరిసిపోతూ కనిపించింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా, ఇందులో లావణ్య త్రిపాఠి కాస్త బొద్దుగా కనిపించింది. ఇంక ఆమె తన పొట్టని చీర కొంగుతో కవర్ చేసుకోవడంతో అందరిలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రగ్నెంట్ కాబట్టే లావణ్య తన పొట్టని ఇలా కవర్ చేసుకుందని అంటున్నారు. త్వరలో మెగా ఫ్యామిలీలో వారసుడు వస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో.