Site icon vidhaatha

Laya| ల‌య వెంట‌ప‌డి ఆ డైరెక్ట‌ర్ చంపుతాన‌ని బెదిరించాడా..!

Laya|  సీనియ‌ర్ హీరోయిన్ లయ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వేణు తొట్టెంపూడి హీరోగా వ‌చ్చిన‌ బ్లాక్ బస్టర్ మూవీ స్వయం వరంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది ల‌య‌. కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 1999 ఏప్రిల్ 22న రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఆ త‌ర్వాత ల‌య‌కి చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి.వాటిలో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే ఆమెకి పెళ్లి కావ‌డంతో .. సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పింది. చివ‌రగా.. ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ అనే సినిమాలో అమ్మవారి పాత్రలో క‌నిపించి అల‌రించింది.

పెళ్లి త‌ర్వాత అమెరికా వెళ్లిన ల‌య అక్కడ నాలుగేళ్ల‌పాటు ఐటీ జాబ్ చేసింది. ఆ త‌ర్వాత డ్యాన్స్ స్కూల్ పెట్టింది.ఇక కోవిడ్ త‌ర్వాత దానిని ప‌క్క‌న పెట్టేసి సోష‌ల్ మీడియాలో సంద‌డి చేయ‌డం మొద‌లు పెట్టింది. వీడియోలు, ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో నెటిజ‌న్స్‌కి కావ‌ల్సినంత వినోదం పంచింది. ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తాజాగా ల‌య ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు ఎదురైన విచిత్ర ప‌రిస్థితుల గురించి చెప్పుకొచ్చి అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది.

నేను అడుక్కుతింటున్నానని నేను రోడ్డున పడ్డానని నాపై ఎన్నో రూమ‌ర్స్ సృష్టించారు. వాటిని గుర్తు చేసుకుంటే చాలా బాధ క‌లుగుతుంది. సినిమాల‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇండియాకి వ‌చ్చాను అని పేర్కొంది. ఇక త‌న జీవితంలో జరిగిన ఒక ఘ‌ట‌న గురించి కూడా చెప్పింది. ఒకానొక సమయంలో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న దర్శకుడు నన్ను ఫాలో అయ్యాడని ఆమె పేర్కొన్నారు. బేగంపేటలో కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని ఆయన బెదిరించాడని లయ అన్నారు. నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్ పోర్టుకు వెళ్ల‌గా, అక్క‌డికి కూడా వ‌చ్చాడు. అయితే అప్పుడు నేను.. మీరు చంపుతారన్నా నేనేం చేయలేనని ఇక్కడ ఎవరూ లేరని మీ ఇష్టం చంపేయండి అని అన్న‌ట్టు ల‌య పేర్కొంది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

 

Exit mobile version