ఎస్ఎస్ఎంబీ29(SSMB29).. ఈ తాత్కాలిక టైటిల్ ఇప్పటికే బాగా ఫేమస్ అయింది. అసలు పేరు గరుడ()గా గుసగుసలు వినిపిస్తున్నాయి. జనవరిలో షూటింగ్ మొదలు కానుంది. దర్శక బృందం ప్రస్తుతం కెన్యాలో ఉంది. అమెజాన్ అడవుల్లో పర్యటన ఇంకా బాకీ ఉంది. మరో టీమ్ కథ, స్క్రీన్‌ప్లే మీద పనిచేస్తుంటే, మరో టీమ్ నటీనటుల లుక్స్ మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉన్నారు. తెలుసు కదా.. ఇదంతా మహేశ్–రాజమౌళిల సినిమా చరిత్రే.
ఇండియానా జోన్స్(Indiana Jones) కాదు.. ఇండియన్ జోన్స్(Indian Jones)ను సృష్టించబోతున్నాడు ఎస్‌ఎస్‌ఆర్‌ఎం. మహేశ్‌బాబు హీరోగా, అటవీసాహసయాత్ర(Forest Adventure) కథతో రాజమౌళి తీయబోతున్న చిత్రం రెండు భాగాలు(Two Parts)గా, సుమారు వెయ్యి కోట్ల(1000 Crores) బడ్జెట్‌తో రూపొందబోతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు భారత్‌లో అత్యధిక వ్యయంతో తయారైన సినిమా రోబో 2.0. దీనికి 570 కోట్లు ఖర్చు చేసారు. రెండోస్థానంలో ఆర్ఆర్ఆర్ ఉంది. ఇది 550 కోట్లతో తయారైంది. ఇప్పుడు #SSMB29 వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఇండియాలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకోబోతున్న చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఇక ఈ చిత్ర విశేషాలు అన్నీఇన్నీ కావు. భారత్‌లోనే మొట్టమొదటిసారిగా ఏఐ సాంకేతికత(AI technology)ను పూర్తిస్థాయిలో వినియోగించుకోబోతున్న చిత్రం. కొన్ని పాత్రలు, జంతువులు కృత్రిమ మేధ ఆధారంగా తయారుకాబోతున్నాయట. ఏఐని సమర్థవంతంగా ఉపయోగించడం కోసం ఏకంగా రాజమౌళే శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. విఎఫ్ఎక్స్ను సుందరంగా తీర్చిదిద్దడంలో రాజమౌళిని మించినవారెవరూ ఉండరు. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ‘అవతార్’(Avatar)ను మించి ఉంటాయని చెపుతున్నారు.
ఆర్ఆర్ఆర్తో ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాను ఇండియన్ గ్లోబల్ సినిమాగా పరిచయం చేయబోతున్నారు. ఇందుకోసం హాలీవుడ్‌లోని ప్రముఖ స్టుడియోలు(Hollywood Studios), విఎఫ్ఎక్స్ కంపెనీలు, దర్శకులను సంప్రదించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా మహేశ్‌బాబును కూడా గ్లోబల్ హీరోగా మార్చబోతోందన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అందుకు సూపర్‌స్టార్ కూడా బాగానే కష్టపడుతున్నాడు. లుక్ కూడా పూర్తిగా మార్చేసాడు. పొడుగాటి జుట్టు, గుబురు గడ్డంతో ఇండియన్ కీనూ రీవ్స్(Keanu Reeves)లా తయారవుతున్నాడు. నిపుణులైన ఫిట్నెస్ ట్రైనర్స్ సహాయంతో కసరత్తులు కూడా బాగా చేస్తున్నట్లు ఫోటోల ద్వారా తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ కీరవాణి సంగీతం అందిస్తారు.